Anantapur

News January 28, 2026

ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

జనవరి 31 లోపు ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తి చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

అర్హులైన ఉద్యోగులకు జనవరి 31వ తేదీలోపు నాన్ సెలెక్షన్ పోస్టుల పదోన్నతులు పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు బుధవారం మధ్యాహ్నం 12 గంటల లోపు వివరాలను కలెక్టరేట్‌కు అందజేయాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డీఆర్ఓను నోడల్ అధికారిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 27, 2026

సైక్లింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. ఉరవకొండ యువకుడి విజయం

image

ఉరవకొండకు చెందిన సురేశ్ బాబు సైక్లింగ్‌లో ప్రతిభతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. సురేశ్ చదువు కొనసాగించే అవకాశం లేకపోవడంతో పదో తరగతితోనే క్రీడలపై దృష్టి పెట్టాడు. విశాఖలో సైక్లింగ్ అకాడమీలో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. 2023లో మలేషియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో టాప్-10లో నిలిచాడు. క్రీడా కోటాలో ఐటీబీపీలో ఉద్యోగం పొంది ప్రస్తుతం హరియాణా పంచకులలో శిక్షణ పొందుతున్నాడు.

News January 26, 2026

అండమాన్ జైలును సందర్శించిన MP అంబికా

image

మూడు రోజుల అండమాన్ పర్యటనలో సెల్యులార్ జైలును సందర్శించడం తీవ్ర భావోద్వేగాన్ని కలిగించిందని అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకున్నట్లు తెలిపారు. గొప్ప దేశభక్తులకు నివాళులు అర్పించే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. జైలు గదులు, గోడలు అమర వీరుల త్యాగాలకు మూగ సాక్షులుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

News January 26, 2026

ప్రధాని నోట అనంతపురం మాట.. మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

image

మన్ కీ బాత్‌లో అనంతపురం ‘అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టు’ను ప్రశంసించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 10కి పైగా రిజర్వాయర్ల పునరుద్ధరణ, 7 వేల మొక్కలు నాటడం వంటి ప్రజల సామూహిక కృషిని ప్రధాని గుర్తించడం గర్వకారణమని లోకేశ్ ట్వీట్ చేశారు. నీటి భద్రత కోసం అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్న పోరాటం జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News January 25, 2026

అనంత జిల్లాలో రథసప్తమి ఎఫెక్ట్.. తగ్గిన ధరలు

image

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.240, స్కిన్ లెస్ రూ.260 కళ్యాణదుర్గంలో రూ.280 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. చికెన్ ధరలు తగ్గడంతో మాంసప్రియులు హర్షం వ్యక్తం చేశారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

News January 25, 2026

ATP: ‘గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

image

77వ గణతంత్ర దినోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పరేడ్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

News January 25, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫ్లాగ్ హోయిస్టింగ్, కవాతు, తాగునీరు, సీటింగ్, స్టాల్స్, శకటాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నరు.