Anantapur

News January 23, 2026

కనేకల్: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

image

కనేకల్ మండలం 43 ఉడేగోళం పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు వారిని కనేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

News January 23, 2026

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

image

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 23, 2026

ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

image

అనంతపురంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.

News January 23, 2026

అనంత: భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.

News January 22, 2026

రహదారి భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత: విష్ణు చరణ్

image

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతీ పౌరుడి బాధ్యత అని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 21, 2026

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

image

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News January 21, 2026

రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

image

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.

News January 20, 2026

ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

image

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

News January 20, 2026

జేఎన్‌టీయూ-ఏ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

News January 20, 2026

అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

image

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.