India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి ఆనం నారాయణరెడ్డి అన్నారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కాణిపాకంలో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించాం. ఆగమన పద్ధతి ప్రకారం ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆదేశించాం. సీఎం చంద్రబాబు ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.

DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలలో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే కేసులు నమోదు చేస్తామని డీఈవో వరలక్ష్మీ హెచ్చరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నగరంలో రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోయినా, పరిశీలనకు గైర్హాజరైన ఉద్యోగం లేనట్లేనని తెలిపారు. క్రీడా కోటా కింద అభ్యర్థుల సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సమక్షంలో పరిశీలిస్తామన్నారు.

పలమనేరు అర్బన్ CI నరసింహరాజును VRకు బదిలీ చేస్తూ SP మణికంఠ చందోలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన స్థానంలో పలమనేరు రూరల్ సీఐ మురళీ మోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు. పరిశీలన కోసం చిత్తూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, అపోలో యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన 1478 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.

కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు నుంచి కాణిపాకానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీపీటీఓ రాము తెలిపారు. సాధారణ రోజుల్లో ఐదు బస్సులు 55 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. చవితి రోజు 12 బస్సులు, 130 ట్రిప్పులు తిరిగేలా చూస్తామన్నారు. అలాగే పుష్పపల్లకి, రథోత్సవానికి పది బస్సులు కేటాయించగా 110 ట్రిప్పులు తిప్పుతామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామ సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ(45) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించి, సంతాపం తెలియజేశారు.

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. చిత్తూరు జిల్లాలో 5,27,680 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉండనుంది.

పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన దంపతులు డీఎస్సీలో విజయం సాధించారు. ఆర్.గిరి ప్రసాద్ 82.16 మార్కులు, ఆయన భార్య హేమావతి 81.86 మార్కులతో DSC SGT పరీక్షలో విజయాలు సాధించారు. ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మిత్రులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కృషిని పలువురు అభినందించారు.

తన భర్త చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ప్రోత్సాహమే తనను ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించేలా చేసిందని తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షిత తెలిపారు. ఇటీవల ఆమె యూరప్‌లోని మౌంట్ ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఈ సందర్భంగా తిరుపతి పోలీసు అధికారులతో పాటు చిత్తూరు పోలీసు శాఖ ఆమెను అభినందించింది.
Sorry, no posts matched your criteria.