Chittoor

News March 20, 2026

చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

image

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

News March 20, 2026

బంగారుపాళ్యం: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాళ్యంలో జరిగింది. పాపానివారి పల్లె కోళ్ల ఫారంలో బిహార్‌కు చెందిన లితీశ్ కుమార్ పనిచేస్తున్నాడు. కోళ్ల ఫారం యజమాని ప్రభుతో కలిసి బైకుపై కేజీ సత్రానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో లితీశ్ కుమార్ జాతీయ రహదారిపై పడ్డాడు. అటువైపు వెళుతున్న ట్యాంకర్ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 20, 2026

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు..!

image

అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడచిన 24 గంటల్లో వి.కోట, గుడుపల్లె మినహా మిగిలిన 26 మండలాల్లో వర్షం కురిసింది. గంగవరంలో 39.4 mm, పలమనేరులో 37.8 mm వర్షపాతం నమోదైంది. మండలాలు వారీగా.. యాదమరిలో 28.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 24.2, పెనుమూరులో 23.2, వెదురుకుప్పంలో 22.2, బైరెడ్డిపల్లిలో 17.2, గుడిపాలలో 12.4, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 12.2, చిత్తూరు రూరల్ లో 10.6 mm వర్షపాతం నమోదు అయింది.

News March 19, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు.

News March 19, 2026

తిరుపతి బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ

image

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు నిలయంగా మారింది. రద్దీని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి 24 సెల్ ఫోన్లు దొంగలించారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన అనూష రాజంపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా 150 గ్రా. బంగారు నగల బ్యాగు చోరీకి గురైంది.

News March 18, 2026

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. పాకాల(M) దామలచెరువుకు చెందిన శిరీష, విజయ్ దంపతులకు నెలలు నిండకుండా పాప పుట్టింది. పాలు సరిగ్గా తాగకకపోవడం, తల అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో బాధ పడుతుంటేది. తలలో రక్త స్రావం, నీరు చేరినట్లు గుర్తించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నేతృత్వంలో బ్రెయిన్ ఆపరేషన్ చేసి చిన్నారిని కాపాడారు.

News March 18, 2026

కేంద్ర మంత్రిని కలిసిన రోజా

image

నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.

News March 18, 2026

చిత్తూరు ZP విభజనకు కసరత్తు.!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్‌ను ఎన్నికల నాటికి మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. దీంతో పరిపాలనా సౌలభ్యం మెరుగు పడనుంది.

News March 18, 2026

లక్ష్యం రూ.56 కోట్లు.. ఇంకా రూ.26 కోట్ల బకాయిలు

image

పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో 100% లక్ష్యాలు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.

News March 18, 2026

నేటి నుంచి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన

image

మున్సిపాలిటీ పాలకవర్గానికి గడువు ముగియడంతో బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పరిపాలనాపరమైన నిర్ణయాలను ఇక వారే తీసుకోనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో సెప్టెంబర్ వరకు పాలకవర్గానికి గడువు ఉంది.