India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ జాబితాను మేనేజ్మెంట్ల వారీగా (జిల్లా పరిషత్, ప్రభుత్వం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్) విభజించి అధికారిక వెబ్ సైట్‌లో నమోదు చేశామన్నారు. ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలను సరిచేసి తుది జాబితా విడుదల చేశామన్నారు.

జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాన్ని ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జడ్పీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1 నుంచి 7 స్థాయీ సంఘాలతో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, డ్రంకెన్ డ్రైవ్, లైసెన్స్‌లు, సర్టిఫికెట్లు తదితరు వాటిని పరిశీలించారు. ప్రజా భద్రత ధ్యేయంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ శ్రేణులు పలుచోట్ల నిరసన తెలిపారు. ఆయనపై భూమన కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలలో ఎవరు గుంపులు గుంపులుగా రాదని, జెరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.