India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. ఇప్పటివరకు 12,500 టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా వెయ్యి టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 2,500 టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భూసారాన్ని బట్టి యూరియాను వాడాలని, అధికంగా వాడితే భూమి సారాన్ని కోల్పోతుందని, పంటలో నాణ్యత దిగుబడి తగ్గుతుందని సూచించారు.
చిత్తూరు డీసీసీబీలో జరిగిన అవినీతి గుట్టు రట్టయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్ఓ మోహన్ కుమార్ విచారణ జరిపి నివేదిక కలెక్టర్ సుమిత్ కుమార్కు అందజేయగా చర్యలు తీసుకోవాలని డీసీఓను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. గత పాలకమండలితోపాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
సైబర్ నేరగాడి వలకు చిక్కి ఓ ప్రొఫెసర్ కూతురు రూ.90 వేలు మోసపోయిన ఘటన తిరుపతిలో చోటు చేసుకున్నట్లు రూరల్ CI చిన్నగోవిందు తెలిపారు. ఆయన వివరాలు మేరకు.. మ్యారేజ్ బ్యూరో ద్వారా సంజయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి వెటర్నటీ వర్సిటీలో పని చేస్తున్న ప్రొ. కూతురికి దగ్గర అయ్యాడు. ఆమెను నమ్మించి రూ.90 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె PSలో ఫిర్యాదు చేసింది.
చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు.
చిత్తూరు జిల్లాలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి మంది మగవారికి నగరిలో అత్యల్పంగా 873 అమ్మాయిలు ఉండగా, పలమనేరులో 894, కుప్పంలో 904, చిత్తూరులో 912 మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యత్యాసాలకు బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు ప్రధాన కారణమని భావించి వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ద్రావిడ వర్సిటీలో 2025-26 ఏడాదికి బి.టెక్ (Bachelor of Technology) కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. AP EAPCET-2025లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 11 అన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచన్నారు.
కాణిపాకం అభివృద్ధిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ప్రతిపాదనలు అందజేశారు. కాణిపాకంలో కళ్యాణ మండపం, విశ్రాంతిభవన నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు అందజేసినట్టు ఎమ్మెల్యే, ఈవో పెంచల కిశోర్ తెలిపారు. అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఒంటరి ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. పొలాల ధ్వంసం, మనుషులను సైతం చంపుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒంటరి ఏనుగు నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రజలు నేరుగా కాకుండా ఎస్ ఆకారంలో పరుగెత్తాలని DFO భరణి పేర్కొన్నారు. పరిగెట్టేటప్పుడు ఒంటిపై ఉన్న బట్టలను ఏనుగు ముందు వేస్తే అది వాసన చూసి నెమ్మదించే అవకాశం ఉందని ఆమె వివరించారు.
పుంగనూరు వ్యవ సాయశాఖ డివిజన్ పరిధి అన్ని మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ శివకుమార్ తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్లతో పాటు పెద్ద పంజాణి, గంగవరం మండలాల రైతులకు బయో మెట్రిక్ ద్వారా 601 టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు తమ పాసుపుస్తకాలు, ఆధార్ జిరాక్స్ తో యూరియా పొందాలని సూచించారు.
వెదురుకుప్పం(M) బందార్లపల్లి <<17639393>>క్వారీ గొడవపై<<>> MLA థామస్ స్పందించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్వారీని వెంటనే మూయించేలా చర్యలు తీసుకుంటామని MLA వివరించారు.
Sorry, no posts matched your criteria.