Chittoor

News August 14, 2024

తిరుపతి ఐఐటి 61వ స్థానం

image

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) -2024 డేటాను రూపొందిస్తుంది. ఇందులో ఏర్పేడు సమీపంలోని ఐఐటి (IIT) తిరుపతి ఇంజనీరింగ్ విభాగంలో 61 స్థానంలో నిలిచింది. ఐఐటి మద్రాస్ వరుసగా 6వ సారి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News August 14, 2024

తిరుపతి : 20న జాబ్ మేళా

image

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు 19వ తేదీలోపు https://rb.gy/6son88 గూగుల్ ఫాం లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

News August 14, 2024

చిత్తూరు: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

స్వాతంత్ర దినోత్సవ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. మంత్రి సత్య కుమార్ వేడుకలకు హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. శకటాల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలన్నారు.

News August 13, 2024

తిరుమలకు చేరుకున్న సినీ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

image

ప్రముఖ తెలుగు సినీ నటుడు వరుణ్ తేజ్, సినీనటి లావణ్య త్రిపాఠి కలిసి సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని ఫినిక్స్ అతిథి గృహానికి చేరుకున్నారు. వీరికి జనసేన నాయకులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు రాత్రి బస చేసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.

News August 13, 2024

పలమనేరు: ప్రియుడిని హత్య చేసిన మహిళ అరెస్ట్

image

మండలంలోని లక్ష్మీనగర్‌లో మొగిలిశ్వరయ్య హత్య కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు..గత కొంతకాలంగా మొగిలిశ్వరయ్యతో మంగమ్మ సహజీవనం చేస్తోంది. మద్యం తాగి తనపై అనుమానంతో ప్రతిరోజు వేధించేవాడని, దీంతో కత్తితో పొడి చంపినట్లు నిందితురాలు విచారణలో ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఆమెను రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News August 13, 2024

చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే

image

ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*కుప్పం : రాధాకృష్ణ రోడ్డు
*పలమనేరు : Beside Anna canteen
*పుంగనూరు : పంచాయతీ రాజ్ ఆఫీస్
*మదనపల్లె : అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్
: Weekly Market

News August 13, 2024

23న‌ అంగప్రదక్షిణం టోకెన్ విడుదల

image

నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను 23న విడుదల చేస్తారు.

News August 13, 2024

19న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News August 13, 2024

15న స్విమ్స్ ఓటీ, ఓపీలకు సెలవు

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఓటీ, ఓపీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

News August 13, 2024

ర్యాంకుల్లో వెనుకబడిన చిత్తూరు కాలేజీలు

image

కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యా సంస్థలు వెనుకబడ్డాయి. దేశంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో SVU 87వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 50 యూనివర్సిటీల్లో 39వ ర్యాంకు సాధించింది. ఫార్మా కాలేజీల్లో తిరుపతి మహిళా వర్సిటీ 60, చిత్తూరు శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 79వ ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో తిరుపతి ఐఐటీకి 61వ స్థానం లభించింది.