Chittoor

News October 23, 2024

తిరుపతిలో వ్యక్తి దారుణ హత్య

image

రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లె గ్రామంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. రేణిగుంట అర్బన్ సీఐ శరత్ చంద్ర, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చెంగారెడ్డి పల్లె గ్రామంలో ఈశ్వరయ్య(45) భార్య సుజాత, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆయన రోజు తాగి వచ్చి భార్యను ఇబ్బందులు పెట్టడంతో బండరాయితో తలపై మోది చంపింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News October 23, 2024

పన్ను వసూళ్లపై దృష్టి పెట్టండి: చిత్తూరు కలెక్టర్

image

ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టి పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పని దినాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

నూజివీడులో చిత్తూరు ఎంపీటీసీ డెడ్ బాడీ కలకలం

image

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం ఎంపీటీసీ కే.జగన్నాథం(40) మృతదేహం నూజివీడు ఆసుపత్రిలో కనిపించడం కలకలం రేపింది. చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు JCB కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో పోలీసులకు కనిపించింది.

News October 23, 2024

చిత్తూరు: పట్టాలపై రెండు మృతదేహాలు.. మృతులు వీరే  

image

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రైలు పట్టాలపై నేడు <<14429914>>రెండు మృతదేహాలు<<>> పడి ఉన్న విషయం తెలిసిందే. మృతులు పీలేరు వాసులని కదిరి రైల్వే ఎస్ఐ రహీం తెలిపారు. పట్టణానికి శ్రీనివాసులు కుమారుడు కిరణ్ కుమార్(19) అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు యాసీన్(17) పులిచెర్ల రోడ్డులో పట్టాలపై కూర్చుని మద్యం తాగుతుండగా రైలు ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2024

పీలేరు: రైలు ఢీకొని ఇద్దరు మృతి

image

పీలేరు సమీపంలో నేడు విషాదం నెలకొంది. ఇవాళ వేకువజామున రైలు ఢీకొని ఇద్దరు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News October 23, 2024

తిరుపతి: పెండింగ్ పనులు పూర్తి చేయండి

image

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై NHAI, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 

News October 22, 2024

తిరుపతిలో అగ్గిపెట్టి మచ్చపై దాడి!

image

తిరుపతిలో లీలామహల్ సర్కిల్‌లో ఓ బార్ దగ్గర అగ్గిపెట్టి మచ్చపై కొందరు గుర్తు తెలియని దుండుగులు దాడిచేశారు. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News October 22, 2024

గంగవరం:  లారీ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో చోటు చేసుకుంది. చెన్నై-బెంగళూరు నేషనల్ హైవే నాలుగు రోడ్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ(50)ను చెన్నై వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తు తెలియని మహిళకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే గంగవరం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ బి.ప్రసాద్ తెలిపారు.

News October 22, 2024

 సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మారుద్దాం: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరును సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చుదామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యులు, భోజన నిర్వాహకులు, ఆయాలు, హెల్పర్లు, వాచ్మెన్ తదితరులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.