India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు.

కుప్పం (M) కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత (40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి (M) శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారి కింద పడింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని 7 KGBV బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 40 సీట్లు, 7 నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటరమణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. ఏప్రిల్ 13-17 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు KGBVలోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా, త్రిసభ్య కమిటీ వేసి, పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. సరైన నేత ఉంటే 2029 ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G రామ్ జీ చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. గ్రామీణ కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పన, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 125 రోజుల పనిదినాల అమలుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని పంచాయతీలను అర్బన్, గ్రేడ్–I, II, IIIగా విభజించారు. జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితులను ప్రమాణాలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 621 గ్రామపంచాయతీలు ఉండగా 4 అర్బన్, 100 గ్రేడ్–I, 140 గ్రేడ్–II, 377 గ్రేడ్–IIIగా గుర్తించారు. గంగవరం, కాణిపాకం, కార్వేటినగరం, వి.కోటలను అర్బన్ గ్రామపంచాయతీలుగా ప్రకటించారు. ఈ పునర్ వర్గీకరణతో గ్రామీణ పరిపాలన మరింత సమర్థవంతంగా మారనుంది.

పుంగునూరులో మంగళ, బుధవారాలలో సుగుటూరు గంగ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. జాతరను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. జాతరలో భాగంగా ఈరోజు రాత్రి జమీందారు ప్యాలస్‌లో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలో ఊరేగించనున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు.

ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీచేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్‌లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.