India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక శనివారం చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత స్థానిక శివాలయంలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. శివాలయంలో అర్చకులు, బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పక్కగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్లోని కోర్టు హాల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ప్రసూతి మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ, అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద, మధ్యతరగతి వర్గాల వారు ఉచితంగా కార్పొరేట్ విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇందుకోసం విద్యాసంస్థలు 25% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రవేశానికి తగిన సర్టిఫికేట్లతో సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు మార్చి 10 వరకు మాత్రమే ఉంది. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.

చిత్తూరు కలెక్టరేట్‌లో ఈనెల 9న ఉదయం 11 గంటలకు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం(డీఆర్సీ) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ(పీజీఆర్ఎస్, రీసర్వే), వ్యవసాయ, ఉద్యానశాఖ, విద్య, వైద్యఆరోగ్య శాఖ అంశాలపై చర్చించనున్నారు.

చిత్తూరు పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం చేపట్టారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది వరకు ఏఎస్ఐలు ఉన్నారు. ఒకే స్టేషన్లో మూడేళ్లుగా పనిచేస్తున్న వాళ్ల నుంచి ఐదేళ్ల పాటు పనిచేస్తున్న సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో పన్నుల వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 622 పంచాయతీలు ఉన్నాయి. రూ.24 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్ల రాబట్టారు. ఈనెల 15వ తేదీలోపు మరో రూ.6 కోట్ల వసూళ్లే లక్ష్యంగా సిబ్బంది గ్రామాల్లో తిరిగి రాబడుతున్నారు.

టెన్త్ పరీక్షల కోసం చిత్తూరు జిల్లాలో 129 కేంద్రాలు ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 23,095 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.

చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె మోడల్ స్కూల్‌ను రాంనగర్ కాలనీకి మార్చారు. 10వ తరగతి హాల్ టికెట్లలో కొంగారెడ్డిపల్లె అడ్రస్ ముద్రించారు. ముందుగా సెంటర్ చూసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అక్కడ తాళం వేసి ఉండటంతో ఖంగుతిన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్ కార్యాలయంతో మాట్లాడి హాల్‌టికెట్లు మార్చి ఇస్తామని DEO రాజేంద్ర ప్రసాద్ Way2Newsకు తెలిపారు. మీరు కూడా ముందే ఎగ్జాం సెంటర్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
Sorry, no posts matched your criteria.