India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ వినుత కోటా భర్త కోటా చంద్రబాబుపై పెట్టిన కేసును చిత్తూరు జిల్లా కోర్టు కొట్టి వేసిందని వినుత కోటా ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్బలంతో పోలీసులు 17 అక్రమ కేసులు పెట్టారన్నారు. వాటిల్లో ఒకటి తప్పుడు కేసుగా నిరూపణ కావడంతో కోర్టు కొట్టేసిందని తెలిపారు.
ఇకపై మీరు రాత్రి పూట కాలేజీకి వెళ్లి ఎంచక్కా చదువుకోవచ్చు. పది, ఐటీఐ చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు <<14419916>>పాలిటెక్నిక్ <<>>కోర్సు పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. చిత్తూరు ఎస్వీ సెట్ కాలేజీలో ECE, వేమూ ఇంజినీరింగ్ కాలేజీలో ECE, EEE కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 26 నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతి నందు రీసెర్చ్ అసోసియేట్ -01 పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్ డీ (Ph.D) డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 23.
తిరుపతి : శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ ( SPMVV) లో ఈ ఏడాది ఆగస్టు నెలలో ఎల్.ఎల్.బి (LLB) ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుత పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం యాదమరి మండలంలో ఓ చిరుత <<14412959>>చనిపోయిన<<>> విషయం తెలిసింది. సోమల మండలం చెరువుకోనలో మరో చిరుత కళేబరం వెలుగు చూసింది. గొర్రెల కాపరి సమాచారంతో చిత్తూరు DFO, పుంగనూరు ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. రెండు చిరుతల కళేబరాల కాళ్లు నరికేయడం మిస్టరీగా మారింది. వాటి గోర్ల కోసం చంపేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తిరుపతిలోని ఏఆర్ పరేడ్ మైదానంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అమరులైన పోలీసులకు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తిరుపతి జిల్లాలో జరిగిన వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో నేడు ఓ చిరుత పులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి గోర్ల కోసం ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమలలో భక్తుల సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి భక్తులకు సుమారుగా 8 గంటల సమయం పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మూడు గంటలు పడుతున్నట్టు చెప్పారు. కాగా స్వామి వారిని 80 వేల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా తిరుమలలో కొద్దిమేర రద్దీ తగ్గినట్టు సమాచారం.
తిరుపతి ఎస్వీయూ, పద్మావతి యూనివర్సిటీల్లో మిగిలిన PG కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు నేడే చివరి రోజని ఆయా యూనివర్సిటీల అధికారులు తెలిపారు. AP PG SET-2024 అర్హత సాధించి, రెండు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు ఆయా వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని అధికారులు ప్రకటనలు విడుదల చేశారు.
పిడుగుపాటు ఓ ఇంట తీరని విషాదాన్ని నింపిన ఘటన నేడు KVపల్లె మండలంలో జరిగింది. నూతనకాల్వ గ్రామం గుట్టలపై నడింపల్లెకు చెందిన నాగరాజ నాయుడు(45) నేడు పొలం వద్ద పనులు చేస్తుండగా ఉన్న ఫళంగా పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు ఆయన భార్య పార్వతి(37), తల్లి చిన్నక్క(70) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.