India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు పోలీసు గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. వివిధ శాఖల తరఫున 6 శకటాలను ప్రదర్శించారు. జిల్లా విద్యా శాఖ శకటానికి 2వ బహుమతి లభించింది. మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డీఈవో వరలక్ష్మి, సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణ అందుకున్నారు. ఈ శకటంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, మెగా పీటీఎం 2.0, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ నమూనాలను ప్రదర్శించారు.

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా వందనం స్వీకరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరెడ్ను తిలకించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సిబ్బంది ఆయనకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బంగ్లా సిబ్బంది పాల్గొన్నారు.

సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ అభ్యర్థుల స్కోర్ కార్డులను ఆన్ లైన్లో అప్లోడ్ చేసినట్టు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మెగా డీఎస్సీ తుది కీ, స్కోరు కార్డులను ఇది వరకే విడుదల చేశారన్నారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులు www.apdsc.apcfss.in వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉ. 8.30 గంటలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకొంటారు. ఉ. 8.35 గం.లకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ భారత జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ఉ. 8.55 గంటలకు ముఖ్య అతిథి సందేశం, ఉ.10.20 గం.లక ప్రశంసా పత్రాల ప్రదానం, ఉ. 11 గంటలకు జాతీయ గీతాలపన.

పూతలపట్టు మండలం పేటమిట్టలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళా పోస్టర్లను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో సుమారుగా 25 కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ప్రమాదాల నివారణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి నుంచి జులై వరకు 451 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ఘటనల్లో 221 మంది మృతిచెందారన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

చిత్తూరు జిల్లాను డ్రక్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నషా భారత్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు మార్గాన వెళ్లకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, సరఫరా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

చెరువులో పడి ఆరో తరగతి విద్యార్ధి మృతిచెందిన సంఘటన వి.కోట మండలంలో జరిగింది. యాలకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమారుడు భార్గవ్ (11) వికోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకి వెళ్లి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.
Sorry, no posts matched your criteria.