Chittoor

News August 12, 2025

ద్రావిడ వర్సిటీ: ద.రాష్ట్రాల విద్యార్థుల కోసం దరఖాస్తులు

image

ద్రావిడ వర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాల విద్యార్థుల కోసం UG&PG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. వారికి 10 శాతం రిజర్వేషన్ కలదన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు వర్సిటీలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 12, 2025

గుడికి వెళుతూ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

GD నెల్లూరు(M) పళ్లిపట్టు సమీపంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడుల కోసం కారులో బయలుదేరారు. వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2025

బంగారుపాళ్యం: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

బంగారుపాళ్యం మండలం తగ్గువారి పల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కామరాజు గుండె నొప్పితో చనిపోయారు. ఆయన హెడ్ కానిస్టేబుల్‌గా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News August 12, 2025

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా నాగరాజు

image

సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఎస్.నాగరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 9, 10వ తేదీల్లో నగరిలో సీపీఐ 24వ మహాసభ జరిగింది. నారాయణ, హరినాథ్ రెడ్డి, రామానాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శిగా నాగరాజును ఎన్నుకున్నారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా డాక్టర్ జనార్దన్, శివారెడ్డికి అవకాశం దక్కింది.

News August 11, 2025

క్రీడాకారిణి అక్షయకు MLA అభినందనలు

image

పలమనేరుకు చెందిన రగ్బీ క్రీడాకారిణి అక్షయకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందనలు తెలిపారు. బీహార్ వేదికగా ఈ నెల 9, 10 తేదీలలో జరిగిన ఏషియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో శ్రీనగర్ కాలనీకి చెందిన సురేష్, శ్రీదేవిల కుమార్తె అక్షయ భారత జట్టు తరఫున ఆడి కాంస్య పతకం సాధించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News August 10, 2025

రేపే చిత్తూరుకు బీజేపీ అధ్యక్షుడి రాక

image

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చిత్తూరులో సోమవారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మిట్టూరులో ఛాయ్ పే చర్చ, 10 గంటలకు కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళి, అనంతరం వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నాయకులతో, సాయంత్రం 4గంటలకు మీడియా, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు.

News August 10, 2025

పులిగుండుకు మేఘాల గొడుగు

image

చిత్తూరు జిల్లాలోనే పులిగుండు ప్రముఖ పర్యాటక కేంద్రం. పెనుమూరుకు సమీపంలో రెండు ఎత్తైన కొండలు పక్కపక్కనే ఇలా ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ పెద్ద కొండలపై నుంచి చూస్తే ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల వర్షాలతో ఈ పరిసరాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. పులిగుండుకు మేఘాలే గొడుగులా మారినట్లు నిన్న కనిపించింది. రోహిత్ అనే యువకుడు తీసిన ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

News August 10, 2025

పులిచెర్ల: 11న పీజీఆర్ఎస్‌కు హాజరుకానున్న కలెక్టర్

image

పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహశీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.

News August 9, 2025

గిరిజనులకు ఎల్లప్పుడూ సేవలందిస్తాం : కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశం మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు వారి పిల్లలను విధిగా పాఠశాలకు పంపి విద్యావేత్తలు చేయాలని సూచించారు. గిరిజనులకు ఎలాంటి సేవలు కావాలన్నా నేరుగా తనను, జేసీని సంప్రదించవచ్చన్నారు. గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.

News August 9, 2025

రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తాం: DCCB ఛైర్మన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 75 సింగిల్ విండోల ద్వారా స్వల్ప, దీర్ఘ వ్యవసాయేతర రుణాలుగా రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు DCCB ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండోలకు ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ల విజ్ఞప్తి మేరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం 10 సింగిల్ విండోలకు అన్ని రకాల రుణాల రూపేనా రూ.70 లక్షలు అందించినట్లు తెలిపారు.