India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరులో ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. జాతీయ జెండాను ఎగరవేసి సందేశం ఇచ్చేందుకు మంత్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు.

చిత్తూరు SP మణికంఠ చందోలు నేటి నుంచి వారం రోజులపాటు సెలవులోకి వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఆయన సెలవు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటి వరకు ఇన్‌ఛార్జ్ తిరుపతి SP హర్షవర్ధన్ రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి వినతిని సంతృప్తికరంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. ప్రతి వినతిని గడువులోగా లబ్ధిదారులకు నాణ్యమైన పరిష్కారం అందేలా చూడాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పురవీధుల్లో స్వర్ణ రథోత్సవం వేడుకలు ఉంటాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు.

వివిధ పనుల పురోగతిపై చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ప్రస్తుతం 90 ఏనుగులున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. వీటిలో 18ఏనుగుల గుంపు పులిచెర్ల మండలంలో, 13 ఏనుగుల గుంపు పలమనేరు, బంగారుపాళ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. పలమనేరులో ఒంటరి ఏనుగు, కల్లూరులో రెండు మదపుటేనుగులు సంచరిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో అర్హులైన విద్యార్థులు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులను చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఆదర్శమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సంఘసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు, వినూత్నమైన సేవలతో ప్రతిభ చాటిన 18 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈనెల 15వ తేదీలోపు www.awards.gov.inలో దరఖాస్తు చేయాలన్నారు.

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సూచించారు. వినాయక చవితి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. తిరుమల తరహాలో కాణిపాకం బ్రహ్మోత్సవాల వాహన సేవలను రోజూ రాత్రి 7 గంటలకు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

కోవిడ్ తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం బాధితులు, వారి సంరక్షకులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన 21 మంది చిన్నారులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు.

జిల్లాలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు అర్హత గల పీడీ, పీటీలు దరఖాస్తులు చేసుకోవాలని చిత్తూరు డీఈవో కోరారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పీడీ, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.