Chittoor

News October 14, 2024

తిరుపతి IIT ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024 సంవత్సరానికి PhD, M.S(రీసెర్చ్) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ గడువును అక్టోబర్ 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఐఐటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in చూడండి.

News October 14, 2024

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

image

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవు పాటించాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోనూ కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు ప్రకటించారు.

News October 13, 2024

తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో 24X7 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 08772236007 నంబరుకు సమాచారం కొరకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్, సముద్ర బీచ్ ప్రాంతాలలో రేపటి నుంచి 17 వరకు సందర్శకులకు అనుమతి లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.

News October 13, 2024

పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి

image

తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్‌ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2024

పలమనేరు : 17న జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 13, 2024

తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు

image

గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

News October 13, 2024

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News October 13, 2024

బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూ లైన్

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అన్ని కంపార్ట్మెంట్ లు నిండిపోయి ప్రస్తుతం బాట గంగమ్మ ఆలయం వద్ద క్యూలైన్ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. శనివారం ఒక్కరోజు 73,684 మంది దర్శనం చేసుకున్నారు. 36,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.2.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News October 13, 2024

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ఆహ్వానం పలుకుతూ గరుడ పటాన్ని అవరోహణం చేయడమే ధ్వజావరోహణం అంటారు. ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

News October 13, 2024

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ,పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు.