Chittoor

News October 9, 2024

14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

News October 9, 2024

నేటి నుంచి రూ.49కే K.G టమాటా: చిత్తూరు జేసీ

image

చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.

News October 9, 2024

14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

News October 9, 2024

చిత్తూరు: 14 నుంచి పల్లె పండగ వారోత్సవాలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. పంచాయతీల వారీగా శంకుస్థాపనలు, ఎమ్మెల్యేల వారీగా రోజువారి అభివృద్ధి పనుల ప్రణాళిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ రోడ్లు, పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. 

News October 8, 2024

బెట్టింగ్‌కు దూరంగా ఉండండి: చిత్తూరు SP

image

బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోళ్ విజ్ఞప్తి చేశారు. జీడీ నెల్లూరులో బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన స్పందించారు. ‘బెట్టింగ్‌లో రూ.25 లక్షల వరకు పోగొట్టుకోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో బెట్టింగ్ చట్టవ్యతిరేక చర్య. దీని ఊబిలో పడి మోసపోకండి’ అని ఎస్పీ సూచించారు.

News October 8, 2024

ఏర్పేడు: మందు తాగేటప్పుడు తిట్టాడని చంపేశారు

image

ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద జరిగిన హత్య కేసులో దినేశ్ కుమార్, లోకేశ్ ఇద్దరు ముద్దాయిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రవీణ్ కుటుంబానికి, దినేశ్ కుటుంబానికి మనస్పర్థలు ఉన్నాయని చెప్పారు. మందు సేవించేటప్పుడు ప్రవీణ్ దినేశ్‌ను తిట్టేవాడని, కొట్టేవాడని చెప్పారు. మనస్పర్ధలు కారణంగా ప్రవీణ్‌ను మచ్చు కత్తితో లోకేశ్ సహాయంతో దారుణంగా చంపినట్లు చెప్పారు.

News October 8, 2024

హత్య కేసులో అనిల్ పాత్రే కీలకం..

image

మదనపల్లె జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమారిని అదే కాలనీలో ఉండే వెంకటేశ్ నమ్మించి నీరుగట్టుపల్లిలోని సాయిరాంవీధికి చెందిన అనిల్ ఇంటికి గతనెల 28న తీసుకొచ్చాడు. అక్కడ మంత్రాలు, తాయత్తుల పేరుతో స్వర్ణకుమారిని అనిల్ పథకం ప్రకారం వెంకటేశ్, అనిల్ ఇద్దరు కలిసి హతమార్చారు. అనంతరం మూటగట్టుకుని గుంత తవ్వి స్వర్ణకుమారిని అందులో పాతిపెట్టారు. అనంతరం విమానాల్లో షికార్లు చేస్తుండగా పట్టుకున్నారు.

News October 8, 2024

అలిపిరి మెట్ల మార్గంలో గుండెపోటుతో భక్తుడు మృతి

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఓ భక్తుడు మృతి చెందిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. నాగలాపురం మండలం రెడ్డి వీధికి చెందిన సుబ్రహ్మణ్యం (65), తన భార్య లత మరో 15 మంది భక్తులతో కలిసి శనివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. సోమవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గంలో కొండను ఎక్కుతుండగా 2400 మెట్టు వద్ద ఫిట్స్ వచ్చి కిందపడి పోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

News October 8, 2024

చిత్తూరు: 365 మంది VRO లు బదిలీ

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 365 మంది వీఆర్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1 కేడర్ వీఆర్ఓలను 240 మంది, గ్రేడ్ 2 కేడర్‌లో 125 మంది మొత్తం 365 మంది వీఆర్ఓలను బదిలీ చేశారు. బదిలీ అయిన వీఆర్ఓలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 8, 2024

చిత్తూరు: ఉచిత ఇసుక విధానం అమలు : కలెక్టర్

image

జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. https://sand.ap.gov.in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.