India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్, ఎస్ పి మణికంఠ చందోలుతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. https://sand.ap.gov.in/ ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
మదనపల్లె జగన్ కాలనీలో గత నెల 9న అదృశ్యమైన స్వర్ణకుమారిని హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు వెంకటేశ్‌ను సోమవారం కర్ణాటకలో పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఆమెను పథకం ప్రకారం హత్యచేసి, 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు. మంగళవారం DSP, MROల సమక్షంలో హత్య కేసు వివరాలు, వెంకటేశ్ అరెస్టు మీడియాకు బహిర్గతం చేయనున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఈఓ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు.
గరుడ సేవ కోసం మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 1264 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోప్ పార్టీలతో భక్తుల రద్దీ నియంత్రించాలన్నారు. భద్రతా తనిఖీలు కొనసాగించాలన్నారు. ఏ చిన్న ఘటనకు ఆస్కారం ఇవ్వరాదన్నారు.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం మేళం దొడ్డి సమీపంలో ఉన్న మేకనజామనపల్లి క్వారీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే పుంగనూరు, మదనపల్లెకు తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 10వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృధి శాఖ అధికారి లోకనాదం పేర్కొన్నారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమాతోపాటూ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం భారీగా సాధారణ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలోని DPO పరిధిలో 405 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకు 202 మంది, గ్రేడ్-5 కింద 152 మంది, ఈవోపీఆర్డీలు ఏడుగురు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6(డిజిటల్ అసిస్టెంట్) 44 మంది బదిలీ అయ్యారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలైన నాగరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిన్న రాత్రి నాగరాజు రెడ్డి మరణించగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన భార్య జయంతి, సాయంత్రం కుమార్తె సునిత మృతి చెందారు. ఆదివారం ఆయన కొడుకు దినేశ్ రెడ్డి కూడా మరణించాడు. ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.
చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.