India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. SI నాగేశ్వరరావు వివరాల మేరకు.. 15 ఏళ్ల బాలికను ఆమినిగుంట పంచాయతీకి చెందిన నాగేంద్ర ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భణిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఓ యువకుడు తన వాహనానికే నిప్పు పెట్టుకున్న ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. గిరి అనే యువకుడు పూజాగానిపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించిదన్న కోపంతో గిరి ఆమె ఇంటి ముందు మంగళవారం తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జ్యూట్ బ్యాగులను వినియోగించి, పర్యావరణాన్ని పరి రక్షించుకుందామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కార్యాలయంలో జ్యూట్ బ్యాగులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని ఎంపీ సూచించారు.

మే 31లోపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమైయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై సచివాలయ మండల నియోజకవర్గ స్థాయి అధికారులు డాక్యుమెంట్ తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు.

వెదురుకుప్పం మండలం పాతగుంట టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గోపికృష్ణరెడ్డి కుమార్తె భావన మిస్ గ్లోబల్ ఏషియన్-2025గా నిలిచింది. ఈక్రమంలో ఆమె పాతగుంటకు మంగళవారం చేరుకున్నారు. గ్రామస్థులు ఆమెకు ఆహ్వానం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రబాబు రెడ్డి, లోకనాథ రెడ్డి, తిమ్మరాజులు, హేమ శేఖర్, ఎమ్మెస్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్తూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని రాంనగర్ కాలనీకి చెందిన దావూద్, రేష్మ భార్యభర్తలు. మనస్పర్థలతో ఇటీవలే విడిపోయారు. ఈక్రమంలో నిన్న రాత్రి దావూద్ రేష్మ ఇంటికి వెళ్లి కాపురానికి రావాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో దావూద్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రేష్మ ముఖంపై చల్లాడు. ఆమె గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. గాయపడిన రేష్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి(DCHS)గా డాక్టర్ పద్మాజలి దేవి బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తూ జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారిగా ప్రమోషన్ పొందారు. ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్ ప్రభావతి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా పనిచేస్తానని చెప్పారు.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. సోమవారం ఆయన స్వామి వారి దర్శనానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మారుతి ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సీడాప్ ఆధ్వర్యంలో DDUGKY పథకం ద్వారా చిత్తూరు, తిరుపతిలో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్డీఎ పీడీ శ్రీదేవి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-28 ఏళ్లలోపు యువతీ యువకులు ఈనెల 9వ తేదీలోపు అడ్మిషన్లు చేసుకోవాలన్నారు. ఈ రెసిడెన్షియల్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9963561755 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయ లక్ష్మి, అనుపమ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.