Chittoor

News July 24, 2024

తిరుపతి: TTD బోర్డు రద్దు

image

TTD బోర్డు రద్దయింది. 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌‌అఫీషియో మెంబర్లతో కూడిన బోర్డును గత YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం రావడంతో TTD ఛైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇప్పుడు 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాల ఆమోదంతో TTDకి కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుంది.

News July 24, 2024

తిరుపతి: దిండుతో అదిమి భర్తను చంపేసిన భార్య

image

పాడిపేట పంచాయతీ శివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నరేశ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. కొన్ని రోజులుగా భార్య ధనలక్ష్మి, నరేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ మృతి చెందడంతో స్థానికులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మే హరి అనే వ్యక్తితో కలిసి తండ్రిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుమార్తె నిదిశ్రీ పోలీసులకు తెలిపింది.

News July 24, 2024

చిత్తూరు: విభిన్న ప్రతిభావంతులకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్తిమ కాలు అమర్చేందుకు ఈనెల 26న ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. చెన్నైకు చెందిన ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని రాస్(తపోవనం) వద్ద నిర్వహించే శిబిరంలో అర్హులు పాల్గొనేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.51వేలు విలువైన ఆధునిక వెయిట్ లెస్ కాలు ఉచితంగా అమర్చుతారని చెప్పారు.

News July 24, 2024

చిత్తూరు: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కళాశాలల్లో రెండో విడత ప్రవేశాల దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలి. ఇతర వివరాలకు iti.ap.gov.in వెబ్‌సైట్ చూడగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 24.

News July 24, 2024

CTR: భువనేశ్వరి దత్తత గ్రామం అదే..!

image

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆమె మట్లాడుతూ.. ఎక్కువ మెజారిటీ వచ్చిన బూత్‌ని తాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పానన్నారు. మాట ప్రకారం కంచిబందార్లపల్లిని దత్తత తీసుకుంటున్నట్ల వెల్లడించారు. ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తానని చెప్పారు.

News July 23, 2024

తిరుపతి: దుష్ప్రచారం చేశారని హత్య

image

తిరుపతిలోని రాయల్ నగర్‌లో ఈనెల 18న జరిగిన జయలక్ష్మి వృద్ధురాలి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలను వివరించారు. జయలక్ష్మి ఇంటి పక్కనే ఉండే శ్రీనివాసులును 2019లో అతని తండ్రి మందలించడంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ అమ్మాయిని తీసుకు వెళ్లిపోయాడని జయలక్ష్మి, ఆమె కుమార్తె రక్ష దుష్ప్రచారం చేశారు. కక్ష పెంచుకున్న శ్రీనివాసులు హత్య చేశాడు.

News July 23, 2024

రైస్‌మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో తనిఖీలు

image

మదనపల్లె రైస్‌మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో రెవెన్యూ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మంత్రిని అడ్డుపెట్టుకొని ఆర్డీవో సహకారంతో మదనపల్లె డివిజన్‌లో రూ.కోట్ల విలువైన భూములను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంలో కూడా ఆయన పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

News July 23, 2024

తిరుపతి: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రేకలచేను గ్రామానికి చెందిన హేమంత్ (31) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ గుండెపోటుకు గురై పొలంలోని బురదలో కూరుకుపోయాడు. దీనిని గమనించి శునకాలు అరవసాగాయి. గుర్తించిన స్థానికులు అతనిని బయటకు తీశారు. మొదట కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు భావించగా అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు. షాక్ కొట్టలేదని నిర్ధారించారు.

News July 23, 2024

మదనపల్లె : కాలిన ఫైళ్లతో కూపీ లాగుతున్న CID

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై సీఐడి చీఫ్ రవిశంకర్ రంగంలోకి దిగారు. మంగళవారం దర్యాప్తు బృందం కాలిన ఫైళ్లతో కూపీ లాగుతోంది. ఏయే విభాగాలకు చెందినవో గుర్తించేందుకు సేకరించిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం మదనపల్లెకు వచ్చిన DGP, సీఐడీ చీఫ్, ఎస్పీ, కలెక్టర్.. ఫైళ్ల దగ్ధం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ వల్ల జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.

News July 23, 2024

మదనపల్లె : పూర్వ RDOను అదుపులోకి తీసుకున్న అధికారులు

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై పూర్వ RDO మురళి, ప్రస్తుత RDO హరిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఒంగోలులో పనిచేసిన మురళిపై అవినీతి ఆరోపణ రావడంతో మదనపల్లె RDOగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడంతోపాటు MROగా రివర్షన్ సైతం ఇచ్చారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేత, రివర్షన్‌ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మురళి తిరుపతి కలెక్టరేట్‌లో పనిచేస్తున్నారు.