India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో 30,713 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 15,639, సెకండియర్‌లో 15, 074 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మచ్చా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
పూతలపట్టు MLA మురళీ మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికాలోని అతి పెద్ద భారతీయ అమెరికన్ సంస్థగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు ఆయన్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలోని నోవో మిచిగన్‌లో జరిగే సదస్సుకు హాజరు కావాలని కోరారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ నటుడు వరుణ్ సందేశ్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని దురాలోచనలను పోగొట్టడానికి జ్యోతిరావ్ ఫూలే అపారమైన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కన్వీనర్ షణ్ముగం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 30,713 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 15,639 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,074మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
ప్రభుత్వం ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ భవన్లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని జయప్రదం చేయాలని కోరారు.
చిత్తూరు ఐటీఐలో ఈనెల 15న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఐబీఎం ఓచర్లో నమోదు చేసుకోవాలన్నారు.
చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.
చిత్తూరు జైలు ఖైదీలకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ తదితర కోర్సుల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ ట్రైనింగ్ ఇప్పించారు. ఫిబ్రవరి, మార్చిలో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో ఓపెన్ క్లాస్ ద్వారా పదో తరగతి పాఠాలు చెబుతామన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు బ్యాంకు లోన్లు సైతం ఇప్పిస్తామని చెప్పారు. మహిళా ఖైదీలకు టైలరింగ్ నేర్పించాలని జైలు అధికారులు కలెక్టర్‌ను కోరారు.
చంద్రగిరి(M) నరసింగాపురంలో యువతి <<16044546>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ సంచలన విషయాలు చెప్పాడు. ‘మూడేళ్లుగా ప్రేమించుకుని గతేడాది గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఆమె తల్లిదండ్రులు నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం రావడంతో అబార్షన్ చేయించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె నన్ను కలిసింది. దీంతో తన అమ్మానాన్న విషం పెట్టి చంపేస్తారని ఆమె నాకు మెసేజ్ చేసింది. ఆ పక్కరోజే ఆమె చనిపోయింది’ అని అజయ్ తెలిపాడు.
Sorry, no posts matched your criteria.