India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.
చిత్తూరు జిల్లా వి.కోటలో సోమవారం వినాయక నిమజ్జనం కోలాహలంగా నిలిచింది. హిందూ, ముస్లిం సోదరులు ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొన్నారు. మరోవైపు వి.కోట లాంగ్ బజార్ మీదుగా ర్యాలీ జరగ్గా.. మసీదు ఆవరణలో గణనాథుని భక్తులకు వాటర్ బాటిళ్లు, జ్యూస్ అందజేశారు. ఇదీ అసలైన మతసామరస్యమని అందరూ కొనియాడారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ చేసి ఆయనకు న్యాయం చేయాలని దళిత నాయకులు కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఆదిమూలం ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిపై కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు.విచారణ జరిపించి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శని,ఆదివారాల్లో జరిగిన వేరువేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు, ఐరాలవారిపల్లెలో ట్రాక్టర్ పై నుంచి పడి ఒకరు, తిరుచానూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మరొకరు కన్నుమూశారు. అలాగే నాగలాపురంలో గృహప్రవేశానికి పిలవలేదని సూసైడ్, తిరుమలలో గుండెపోటుతో మహిళ, బంగారుపాళ్యెం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లి ఎస్ఐ లోకేశ్ రెడ్డి, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్, ములకలచెరువు ఎస్ఐ గాయత్రీపై ఆదివారం రాత్రి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాజంపేట డీఎస్పీ ఆఫీసుకు లోకేశ్ రెడ్డి, రాయచోటికి గాయత్రి, పీలేరుకు దిలీప్ కుమార్‌లను అటాచ్ చేసినట్లు తెలిపారు.
ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బీటెక్ పాసైన, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. శరవణ పురానికి చెందిన శంకర్ పిలై (68) కొంతకాలంగా పాగాయం మెంటల్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆదివారం గిరింపేట గాయత్రి చిల్డ్రన్స్ పార్క్ వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సీఐ తెలిపారు.
జపాన్ దేశంలో నర్సులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు. బెంగళూరులో జపాన్ భాషపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జీతం రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 99888 53335లో సంప్రదించాలని కోరారు.
తిరుపతి శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో జూన్‌లో బీటెక్(B.Tech) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను www.spmvv.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.