India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 28 రైళ్లు రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రద్దు అయిన వాటిలో కాకినాడ పోర్టు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన రైలు ఉంది. మొత్తం 496 రైళ్లు రద్దు కాగా, 152 సర్వీసులను దారి మళ్లించినట్లు చెప్పారు.
రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్‌కు బుధవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్ సైట్ చూడాలని సూచించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, రెస్కో మాజీ ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్‌ను కుప్పం అర్బన్ పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి సెంథిల్ కుమార్‌కు ఈ నెల 13 వరకు రిమాండు విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు అర్బన్ సీఐ జీటీ నాయుడు తెలిపారు. సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో అతని అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం కోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ రకాల సర్టిఫికెట్ డిప్లమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 06.
తిరుమలలో అక్టోబర్ 8న గరుడ సేవ దృష్ట్యా ఘాట్ రోడ్డులో బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. భారీ రద్దీ కారణంగా అక్టోబర్ 7 రాత్రి 9 గంటల నుంచి 9 ఉదయం 6 గంటల వరకు బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
చిత్తూరు పట్టణంలోని ఎమ్మెస్సార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. అభిమానులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సినిమా థియేటర్లో హంగామా చేశారు. సినిమాను తిలకించారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.
తిరుపతిలోని SVU 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 1954లో టంగుటూరి ప్రకాశం పంతులు దీనిని ప్రారంభించారు. యూనివర్సిటీ 1000 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఎంతో మంది ప్రముఖులు, నాయకులు విద్యాభ్యాసం చేశారు. రాయలసీమలోనే కాదు దేశంలో టాప్ యూనివర్సిటీలో ఒక్కటిగా నిలిచింది. సోమవారం 70 సంవత్సరాల వేడుకలు జరుగనున్నాయి. మీరు SVU చదువుంటే కామెంట్ చేయండి.
ఏర్పేడు మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బాలకృష్ణ పురం గ్రామానికి చెందిన రుద్రకన్నబాబు గుండెపోటుతో మృతి చెందారు. అలాగే మండలంలోని చిందేపల్లికి చెందిన పట్ర మనోహర్ ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరారు.
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.