Chittoor

News August 31, 2024

మదనపల్లె: RTC లక్కీడిప్ విజేతలు వీరే..!

image

మదనపల్లె-తంబళ్లపల్లె మార్గంలో RTC గిఫ్ట్ స్కీంలో లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. పట్టణంలోని బస్టాండ్లో డీఎం వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. చిన్ని మధు, B.సాంబశివ, విజయ్‌ను అదృష్టం వరించింది. విజేతలు RTC డిపోనకు వచ్చి బహుమతులు తీసుకోవాలని మేనేజర్ సూచించారు. సెప్టెంబర్ 1నుంచి 25వరకు MPL-BKT మార్గంలో ప్రయాణించే వారికి లక్కీడ్రా ఉంటుందని చెప్పారు.

News August 31, 2024

తిరుమల: భక్తులకు సులభంగా దర్శనం

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తులకు సులభంగా దర్శన భాగ్యం కలిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు ఇతర అధికారులు శ్రీవారి ఆలయ మాడవీధులు, వసంత మండపం, గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించి చర్చించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

News August 31, 2024

తిరుపతి: ‘బాధితులకు న్యాయం చేయాలి’

image

నేర సంఘటనలపై కేసు నమోదు చేసినంతనే సరిపోదని.. బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. స్థానిక మహిళా యూనివర్సిటీ సెమినార్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం కోసం ప్రజలు ఏ సమయంలో వచ్చి ఫిర్యాదు చేసినా స్వీకరించి, సమగ్రంగా విచారణ చేయాలని చెప్పారు. నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు. సమాచారం అందిన వెంటనే నేర స్థలాన్ని పరిశీలించాలన్నారు.

News August 30, 2024

సీఎంకు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం

image

వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబును కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు, పూతలపట్టు MLA మురళీ మోహన్ కలిశారు. స్వామివారి శేషవస్త్రాలతో CMను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను CM చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వానించారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డిని, CS నీరభ్ కుమార్‌ను కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.

News August 30, 2024

చిత్తూరు జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా నాయక్

image

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. చిత్తూరు జిల్లాకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.నాయక్ IAS(2005), తిరుపతి జిల్లాకు ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ IAS(2006), అన్నమయ్య జిల్లాకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి IAS(2008)ని కేటాయించింది.

News August 30, 2024

కుప్పం: కవలల జననం..కొద్దిరోజుల్లోనే తల్లి మృతి

image

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం ఉదయం మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కుప్పం పోలీసులకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ కుప్పం బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి (48)గా సమాచారం. ఇటీవలే ఆమెకు కవల పిల్లలు పుట్టి 28 రోజులు అయిందని, ఈమె ప్రస్తుతం ప్రసూతి సెలవులలో ఉన్నట్టు తోటి అధ్యాపకులు తెలిపినట్లు పోలీసులు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2024

కల్లూరు: ATM కార్డు మార్చేసి..నగదు డ్రా

image

ATM కేంద్రంలో ఏమార్చి.. కార్డు మార్చేసి రూ.86వేలను అపహరించిన ఘటన ఈ నెల 22న కల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు ASI రాజారెడ్డి కథనం మేరకు.. మండలంలోని కట్టకిందపల్లెకు చెందిన గురుమూర్తినాయుడు ఈనెల 22న కల్లూరులోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసేందుకు యత్నించగా రాలేదు. పక్కనే ఓ గుర్తు తెలియని వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఏటీఎం కార్డు మార్చేశాడు.మరుసటిరోజు 86 వేలు డ్రా చేసుకున్నాడు.

News August 30, 2024

చిత్తూరు: ‘పంచాయితీకి పిలిచి కాళ్లు విరగ్గొట్టారు’

image

పిల్లల గొడవపై పంచాయితీ పెట్టి కాళ్లు విరగ్గొట్టిన ఘటన పీటీఎం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. కమ్మచెరువుకు చెందిన నరేశ్ ఆటో నడుపుతుంటాడు. తన ఇద్దరు పిల్లలు గ్రామానికి చెందిన నరసింహులు పిల్లలతో నిన్న గొడవపడ్డారని రాత్రి పెద్ద మనుషులతో నరసింహులు పంచాయతీ పెట్టించాడు. అక్కడ తన పిల్లల్ని కొడుతుంటే నరేశ్ తిరగబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన నరసింహులు వర్గం నరేశ్‌పై కర్రలతో దాడిచేసి కాళ్లు విరగ్గొట్టారు.

News August 30, 2024

మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : టీటీడీ ఈఓ

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ శ్యామల రావు అన్నారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన అమ్మవారి ఆలయం, వాహన మండపం, నాలుగు మాడా వీధులు, పుష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమల తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

News August 29, 2024

SVU : PG ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో పీజీ (PG) M.A, M.SC 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.