India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ శ్యామల రావు అన్నారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన అమ్మవారి ఆలయం, వాహన మండపం, నాలుగు మాడా వీధులు, పుష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమల తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో పీజీ (PG) M.A, M.SC 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
మాజీ ఎంపీ రెడ్డప్పకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నూతన కారును అందజేశారు. పుంగునూరులో జరిగిన అల్లర్లలో టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో నష్టపోయిన వారికి తాను అండగా ఉంటానని ఎంపీ మిథున్ గతంలోనే ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన రెడ్డప్పకు కొత్త కారును అందజేశారు.
కలికిరి JNTU కళాశాలలో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా, మైదుకూరు జీవి సత్రానికి చెందిన సి.ప్రవీణ్(21) ఈనెల 12న కలికిరి JNTUలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఇంటికి వెళ్లి 26 రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు తిరుపతి రుయాకు తీసుకెళ్లగా గురువారం మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.
నగలు కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తిరుపతిలో బెంగుళూరుకు బస్సు ఎక్కిన ఉమాదేవితో బంగారుపాళెం వద్ద బస్సు ఎక్కిన మహిళలు పక్కనే కూర్చుని మాటలు కలిపారు. ఆమె వద్ద ఉన్న నగల సంచి మాట్లాడుతూనే కాజేసి పలమనేరులో దిగిపోయారు. మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీఐ నరసింహరాజు బృందం వారిని పట్టుకుని రూ.4.5 లక్షల విలువైన ఆభరణాలు ఉమాదేవికి అప్పగించారు. నిందితులు చిత్తూరు వాసులుగా గుర్తించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ అధికారుల విచారణ మొదటి అంకం ముగిసింది. సోమవారం సాయంత్రం మదనపల్లెకి చేరుకున్న CID చీఫ్ రవిశంకర్ అయ్యర్, జిల్లా SP విద్యాసాగర్ నాయుడు, CID DSP వేణుగోపాల్ సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందిని విచారించారు. అదేరోజు రాత్రే సీఐడీ చీఫ్, జిల్లా ఎస్పీ వెళ్లిపోగా మంగళవారం డీఎస్పీ వేణుగోపాల్ విచారణ కొనసాగించారు.
కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు దండుపాళ్యం గేటు వద్ద బుధవారం రాత్రి కారు- ఓ ప్రైవేటు వాహనం ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మరో పన్నెండు మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిలో తిరుపతికి చెందిన జగదీశ్వరి ఉన్నారని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన వారితో ఎస్పీ సుబ్బారాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ప్రయోజనాలపై సమీక్ష చేశారు. పోలీసు శాఖలో పనిచేసిన వారికి ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కోరారు.
మద్యం కుంభకోణాన్ని వెనకుండి నడిపించింది జగన్ అయితే.. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టింది పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డేనని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) ఆరోపించారు. ‘మద్యం డబ్బును హాంకాంగ్‌లోని మకావ్ అనే ప్రాంతానికి తరలించారు. అక్కడ రియల్ ఎస్టేట్, మాల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇన్నీ చేసినా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి దోపిడీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు’ అని RCY ప్రశ్నించారు.
చిత్తూరు కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుబ్రమణ్యం అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని హల్ చల్ సృష్టించాడు. తనకు తెలియకుండా తన సోదరి ఇంటి స్థలాన్ని విక్రయించిందని ఆరోపించాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తనుకు చావే శరణ్యమని ఆవేదని వ్యక్తం చేశాడు .
Sorry, no posts matched your criteria.