Chittoor

News August 18, 2024

శ్రీసిటీకి రానున్న చంద్రబాబు.. ఏర్పాట్ల పరిశీలన

image

ఈనెల 19వ తేదీ సీఎం చంద్రబాబు శ్రీసిటీకి రానున్నారు. ఈ సందర్భంగా శ్రీసిటీలోని కంపెనీలలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ముందస్తు ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీసిటీ అధికారులు పాల్గొన్నారు.

News August 17, 2024

రూ.1000 కోట్ల విలువైన భూములు కాజేశారు: సామంచి

image

తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సామంచి శ్రీనివాస్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికృతమాల, గురవరాజుపల్లె, కరకంబాడి, అన్నసాంపల్లె, వెంకటాపురం పంచాయతీల పరిధిలో రూ.1000 కోట్ల విలువైన భూములు కాజేశారని ఆరోపించారు. భూ దోపిడిలో CMO మాజీ కార్యదర్శి ధనంజయరెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, శ్రీకాళహస్తి EX MLA మధుసూదన్‌రెడ్డి ఉన్నారన్నారు.

News August 17, 2024

చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లపై మీ కామెంట్..!

image

చిత్తూరు జిల్లాలో తొలి విడతలో భాగంగా5 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. మదనపల్లెలో 2, పుంగనూరు1, పలమనేరు 1, కుప్పం 1 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

News August 17, 2024

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు

image

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు ఘన స్వాగతం లభించింది. ముందుగా ఉపరాష్ట్రపతి దంపతులకు మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బ రాయుడు, జేసీ శ్రీ శుభం బన్సల్, కమిషనర్ ఎన్.మౌర్య, MLC డా.సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డా.శిరీష తదితరులు స్వాగతం పలికారు.

News August 17, 2024

CM చంద్రబాబు శ్రీసిటీ పర్యటన షెడ్యూల్

image

CM చంద్రబాబు శ్రీసిటీ పర్యటన షెడ్యూలు ఖరారు అయ్యింది. ఆగస్టు 19వ మధ్యాహ్నం 12 గంటలకు CM.చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీ హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 12-05 గంటలకు శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకుంటారు. 12-50 వరకు పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. 1-2 గంటల వరకు ఫోక్స్ కాన్ గ్లోబల్ CEOలతో సమావేశం నిర్వహిస్తారు. 2:30కు శ్రీసిటీ నుంచి హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

News August 17, 2024

మదనపల్లె: పెళ్లి చేసుకుంటానని బాలికతో సహజీవనం.. ఆపై మోసం

image

మదనపల్లె తాలూకా పోలీసులు శుక్రవారం రాత్రి పోక్సో కేసు నమోదుచేశారు. CI కళా వెంకటరమణ కథనం.. మండలంలోని ఓగ్రామానికి చెందిన ఓ బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన సయ్యద్ బాషా(22) పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News August 17, 2024

కుప్పంలో 24 గంటలు వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌‌పై హత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News August 16, 2024

SVU: మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల

image

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

News August 16, 2024

తిరుచానూరు పోలీసుల అదుపులో ప్రేమజంట

image

విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి(26) మందడంకు చెందిన సాంబశివరావు(33) 11ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.

News August 16, 2024

19న శ్రీసిటీకి CM చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 19న ఆయన శ్రీసిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పరిశీలించారు. భద్రతా విషయాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శ్రీసిటీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.