India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఓటీ, ఓపీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యా సంస్థలు వెనుకబడ్డాయి. దేశంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో SVU 87వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 50 యూనివర్సిటీల్లో 39వ ర్యాంకు సాధించింది. ఫార్మా కాలేజీల్లో తిరుపతి మహిళా వర్సిటీ 60, చిత్తూరు శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 79వ ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో తిరుపతి ఐఐటీకి 61వ స్థానం లభించింది.
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు చిత్తూరు జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. మ్యూటేషన్లు, వెబ్ ల్యాండ్ సవరణలు, 1బీ, దారి సమస్య, భూ తగాదాలపై ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.
తిరుపతి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి వెళ్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. షార్‌లోని ఒకటి, రెండు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఇప్పటికే కాన్వాయ్ రిహార్సల్ చేపట్టారు.
చంద్రగిరి నియోజకవర్గంలో పని చేయడానికి పోలీసు అధికారులు ఆసక్తిగా చూపడం లేదు. ఎన్నికలకు ముందు ఇక్కడ జరిగిన అల్లర్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికీ చంద్రగిరికి డీఎస్పీ నియమించ లేదు. మహిళా పీఎస్ డీఎస్పీ నరసింగప్ప ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పాకాల, భాకరాపేట సీఐలను బదిలీ చేసినా అక్కడ కొత్త వాళ్లను నియమించ లేదు. తిరుచానూరు సీఐగా సునీల్ కుమార్ ఒక్కరే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి రూ.51,09,116 విరాళం చెక్కును అందించారు.
నీటికుంటలో పడి మహిళ చనిపోయిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో వెలుగు చూసింది. ఎలకపల్లె పంచాయతీ కురప్పల్లెకు చెందిన నారాయణస్వామి భార్య రత్నమ్మ(60) సోమవారం పొలం వద్దకు బయల్దేరింది. ఈక్రమంలో దారి పక్కన ఉన్న నీటి కుంటలో జారి పడిపోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా ఆమె చనిపోయింది.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఓ బాలుడికి శిక్ష పడింది. చిత్తూరుకు చెందిన బాలుడిపై నేరం రుజువు కావడంతో తిరుపతి జువైనల్ జస్టిస్ కోర్టు సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించింది. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారమవుతామని.. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు సదాభిప్రాయం కలుగుతుందని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) వైరాలజీ విభాగంలో లాబరేటరీ టెక్నీషియన్‌కు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఈనెల 14(బుధవారం) నుంచి అర్హత కలిగిన వారు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ చూడాలి.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో MCA (CBCS) 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.