EastGodavari

News September 8, 2024

కాకినాడ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

కాకినాడ జిల్లాలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క పాఠశాల నిర్వహించకూడదని, విధిగా సెలవు అమలు చేయాలన్నారు.

News September 8, 2024

కాకినాడ: మద్యం తాగుతూ గొడవ.. వ్యక్తి హత్య

image

కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మణ్‌రావు(58), రాంబాబు ఇద్దరు కలిసి మద్యం తాగుతుండగా వాగ్వాదం జరిగింది. కోపంలో రాంబాబు చాక్‌తో లక్ష్మణ్‌రావు గొంతు కోశాడు. గాయపడిన లక్ష్మణ్ రావును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందాడు. దీనిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 8, 2024

కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కాకినాడ జిల్లా వాసి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటకు చెందిన నక్క సత్యనారాయణ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఉండి సామాన్య కార్యకర్తగా సేవలు అందించానన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

News September 8, 2024

తూ.గో.: 3 జిల్లాలకు DCC నూతన అధ్యక్షులు

image

తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మద్దేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు.

News September 8, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లా ఇన్‌ఛార్జి హైకోర్టు జడ్జిగా జస్టిస్ జయసూర్య

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి హైకోర్ట్ జడ్జిలను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు ఈ నెల 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హైకోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా జస్టిస్ జయసూర్యను నియమించారు.

News September 8, 2024

అల్లకల్లోలంగా ఉప్పాడ బీచ్.. నేడు, రేపు జాగ్రత్త

image

ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసి పడడంతో ఆ ప్రాంతమంతా కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. శనివారం బీచ్ రోడ్డులో వెళ్లిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలల కారణంగా తీర ప్రాంతంలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కాగా.. వాతావరణ శాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలు ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 8, 2024

పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొత్తూరి శ్రీనివాస్

image

అమలాపురానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్ ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనేక పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ పేర్కొన్నారు.

News September 7, 2024

తూ.గో.: ఫ్రెండ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

తూ.గో. జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు <<14036102>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్, పల్నాడు జిల్లాకు చెందిన కార్తిక్ రాజమండ్రిలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు చదువుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గుండెలో నొప్పిరావడంతో అందరూ కలిసి రాజమండ్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా యాక్సిడెంట్ జరిగింది.

News September 7, 2024

కాకినాడ: 11న ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా

image

కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 11వ తేదీన ప్రైమినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల వర్మ తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రభుత్వ & ప్రైవేట్ ఐటీఐ పూర్తి చేసి NTC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని అన్నారు. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు వచ్చి తమకు కావలసిన అప్రెంటిస్లను ఎంపిక చేసుకుంటారన్నారు.

News September 7, 2024

రాజమండ్రిలో చిరుత

image

రాజమండ్రి అటవీప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతంవైపు శుక్రవారం వేకువజామున చిరుత ఓ జంతువును నోటకరిచి రోడ్డు దాటింది. దీనిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిడంతో వారు పాదముద్రలు సేకరించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.