EastGodavari

News April 1, 2026

బొమ్మూరు: తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా శ్రీనివాస్

image

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా డా.ముసుగు శ్రీనివాస రావు నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీ.మునిరత్నం నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డా.శ్రీనివాసరావు విశ్వవిద్యాలయంలో మంగళవారం రిజిస్ట్రార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనను ఈ పదవికి నియమించినందుకు ఉపాధ్యక్షుడు ఆచార్య డీ.మునిరత్నం నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News March 31, 2026

యర్నగూడెం హైవేపై యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

image

యర్నగూడెం NH16పై సోమవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు..గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 30-40 ఏళ్లున్న వ్యక్తి స్పాట్‌లో మరణించాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96624, 94407 96584 నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 30, 2026

వాహనాల వేలం ద్వారా రూ.10.06 లక్షల ఆదాయం: ఆర్టీఓ

image

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు, ఫిట్‌నెస్ లేని 36 వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.10,06,600 ఆదాయం సమకూరినట్లు జిల్లా రవాణా అధికారి (ఆర్టీఓ) ఆర్.సురేశ్ తెలిపారు. పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో వివిధ కేటగిరీల వాహనాలను వేలం వేశామన్నారు. యజమానులు సకాలంలో పన్నులు చెల్లించి పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 30, 2026

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక

image

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సాకుతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు తెలపాలని కోరారు. నిర్వాహకులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.

News March 29, 2026

రాజమండ్రి: ‘జనగణన డేటా సేకరణ పకడ్బందీగా చేపట్టాలి’

image

2027 గృహ జనగణన డేటా సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని డీఆర్ఓ సీతారామ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌ఎంసీ సమావేశ మందిరంలో 2027 గృహ జనగణన డేటా సేకరణకు సంబంధించి నియమితులైన ఫీల్డ్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గృహ, జనగణన డేటా సేకరణలో క్షేత్ర శిక్షకులు ప్రధాన పాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

News March 29, 2026

రాజమండ్రి: సమస్యలను కలెక్టర్‌కు తెలపండి

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో మార్చి 30న PGRS రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2026

తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

image

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.