India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీతానగరం(M) రఘుదేవపురంలో ట్రాక్టరు తిరగబడి ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఇటుకబట్టీ యజమాని వెంకటేశ్వర్లు బట్టీ వద్ద మట్టి తొక్కుతుండగా ట్రాక్టరు తిరగబడి మట్టిలో కురుకుపోయాడు. ఎక్స్‌కవేటర్ సాయంతో అతడిని బయటకు తీసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీను తెలిపారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ఈనెల 11 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో సమ్మర్ స్పెషల్ రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. 07025 చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్డు వద్ద ప్రతి శుక్రవారం, 07026 శ్రీకాకుళం రోడ్డు – చర్లపల్లి రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుదని పేర్కొన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటర్ల జాబితాల నాణ్యత, స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియజేశారు. గురువారం డీఆర్‌ఓ ఛాంబర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాల ఈఆర్ఓలు తదితర సిబ్బందితో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడారు.
ద్వారపూడి – కడియం రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడని రాజమండ్రి జీఆర్పీ ఎస్ఐ మావుళ్ళు గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుడు బ్లూ కలర్ ప్యాంటు, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతుడి వద్ద టాటానగర్ నుంచి పాలకాడ వరకు జనరల్ టికెట్ లభ్యమైందన్నారు.
భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్‌లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తూ.గో. జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం లారీ ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ రాజానగరం మండలం జి.యర్రంపాలెం గ్రామానికి చెందిన మోటర్ సైకిలిస్టు శ్రీను (50) రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తణుకు మండలం వేల్పూరులోని మేనకోడలి ఇంటి వద్ద నుంచి జి.యర్రంపాలెం గ్రామం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం ఏఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నలుగురు వ్యక్తులకు టోకరా వేసిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. స్థానిక జీజీహెచ్‌లో తనకు అధికారులు తెలుసునని..ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6.50లక్షలు వసూలు చేసింది. అనంతరం ఆమె ముఖం చాటేయడంతో మోసపోయామని తెలుసుకున్న నలుగురు బాధితులు మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లక్ష్మి సూర్యప్రభకు వారు ఫిర్యాదు చేయగా ఘటనపై ఆమె ఎంక్వైరీ ప్రారంభించారు.
తూ.గో జిల్లాలో అకాల వర్షాలతో అవస్థలు తప్పడం లేదు. వర్షంతో పంట నష్టం జరుగుతోంది. పిడుగులు సైతం పడుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెనికి చెందిన వెలగాని సత్యనారాయణ(46) సైతం నిన్న పిడుగుపడి చనిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన ఇటీవల గ్రామానికి వచ్చి చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకండి.
Sorry, no posts matched your criteria.