India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఎం.కృష్ణ కుమారి నియమితులయ్యారు. విశాఖపట్నంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షాన్ మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలు సూచనలు చేశారు.
కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కందులు దుర్గేశ్ బుధవారం కడియపులంక నర్సరీ ప్రాంతానికి వెళ్లి చిరుత జాడపై ఫారెస్ట్ అధికారులను ఆరా తీశారు. నర్సరీ ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్‌లో ఉన్నానని, ఇలాంటి సమయంలో లేనిపోనివి ప్రచారం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నాననే మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే పార్టీ నేతలను కలుస్తానని చెప్పారు.
కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కందులు దుర్గేష్ బుధవారం కడియపులంక నర్సరీ ప్రాంతానికి వెళ్లి చిరుత జాడపై ఫారెస్ట్ అధికారులను ఆరా తీశారు. నర్సరీ ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా నేడు నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘ సభ్యులు సెలవు ప్రకటించారు. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.
అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ అంశం రాష్ట్రంలో వివాదాస్పదం కావడంతో అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆలయ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏడాదికి 2 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో నెయ్యికి రైతు డెయిరీకి రూ.538.60 చెల్లిస్తున్నారు.
అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ అంశం రాష్ట్రంలో వివాదాస్పదం కావడంతో అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆలయ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏడాదికి 2 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో నెయ్యికి రైతు డెయిరీకి రూ.538.60 చెల్లిస్తున్నారు.
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రం 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 13700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.
పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందారు. ఆర్థిక సమస్యలు కారణంగా కాలేజీలో చేరేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి నాయకులు తీసుకువచ్చారు. తక్షణం స్పందించి రూ.4.లక్షలు ఆర్థిక సహాయం చేశారు. మంగళగిరి కార్యాలయంలో విద్యార్థిని జగదీశ్వరి, ఆమె తండ్రికి పవన్ చెక్కును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రిని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు, నాయకులతో కలిసి సమస్యలను వివరించారు. ఆ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.
Sorry, no posts matched your criteria.