India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. సోమవారం ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద జీటీ రోడ్డు స్థలంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పచ్చదనం ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, బాధ్యత గల పౌరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు.
అమరావతి ఓపెన్ స్కూల్ ద్వారా జారీ చేసిన పదవ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని తూ.గో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం కొవ్వూరుకు చెందిన లావణ్య లక్ష్మీకి అందజేశారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో లావణ్య లక్ష్మీ 500 మార్కులకు 345 మార్కులు సాధించారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, దీనికి లావణ్య ప్రత్యక్ష సాక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.
బొమ్మూరు రాఘవేంద్రనగర్‌కాలనీకి చెందిన వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కర ఘాట్‌లో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మురళీకృష్ణ గల్లంతయ్యాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకి లభించలేదు. ఆదివారం కుమారిటాకీస్ సమీపంలో దోబీ ఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. ఈ మేరకు టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేశారు.
జాతీయ భావజాలాన్ని ప్రజల్లో పెంపొందిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో బీజేపీ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు. ఆదివారం కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించే విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.
నిడదవోలు గణేష్ సెంటర్‌లో జీవీ మాల్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడి వయస్సు 55 ఏళ్లు ఉంటాయని, ఆర్టీసీ బస్సు టికెట్‌తో పాటు కంటి ఆసుపత్రి అడ్రస్సు ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96659 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
సర్దార్ పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్ధార్ పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న భరత్ మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ సాధించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని, వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఆమె ఆదేశించారు.
స్వయంకృషితో అగ్ర నటుడిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలలో కూడా అనితర సాధ్యుడిగా నిలిచారని మంత్రి కందుల దుర్గేశ్ కొనియాడారు. ఆదివారం ఇన్నీసుపేటలోని మున్సిపల్ స్కూల్లో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను అభినందించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని, వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఆమె ఆదేశించారు.
తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీన రాజమండ్రిలో మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ‘జాబ్ మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హెచ్.హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో ఇన్నోవా సోర్స్, SBI పేమెంట్, నవతా తదితర ప్రముఖ కంపెనీలులో పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి 19-30 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని వివరించారు.
Sorry, no posts matched your criteria.