India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 నిర్వహణకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే స్వీయ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పవన్ సూచించారన్నారు.

కోరుకొండ(M) నరసాపురానికి చెందిన నొక్కి వెంకటలక్ష్మి(37) అన్నదేవరపేట వెళ్లేందుకు యేసు బైక్‌పై లిఫ్ట్ అడిగింది. సీతానగరం(M) వంగలపూడి శివారులో వెళ్తుండగా ట్రక్కు అడ్డు రావడంతో యేసు సడన్ బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనుక కూర్చున్న వెంకటలక్ష్మి అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఘాతంతో బొంతు వంశీ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల సమాచారం.. చాగల్లు మండలం చిక్కాలపాలెం వద్ద కొబ్బరి ఆకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని కోరారు. పంటల వైవిధ్యం పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని శిక్షణ పొందుతున్న వారికి దిశానిర్దేశం చేశారు.

దొంగతనం కేసులో బెయిల్‌పై వచ్చి, కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్థుడు ఎండ్రగుత్తి రామరాజును ఎస్సై మనోహర్ అరెస్ట్ చేశారు. లక్కవరం గ్రామానికి చెందిన ఇతనిపై కొవ్వూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు, శనివారం కోర్టులో హాజరుపరిచారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.