EastGodavari

News April 7, 2026

పులి భయం వీడింది.. పర్యాటకం మెరిసింది!

image

కాకినాడ, తూర్పు, పోలవరం జిల్లాల్లో పది రోజులుగా వణికిస్తున్న పులి సంచారం తగ్గడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. పులి పాపికొండలు అభయారణ్యం వైపు వెళ్లడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. పాపికొండలు విహారయాత్రకు, పోశమ్మగండికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ముంపు ప్రాంతాల గిరిజనులు జీడిపిక్కల సేకరణకు బయటకు వస్తుండగా.. అటవీశాఖ పర్యవేక్షణ కొనసాగుతోంది.

News April 7, 2026

రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 6, 2026

News April 5, 2026

కొవ్వూరు: కరెంటు షాక్‌తో రైతు మృతి

image

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు హైవే రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పొలంలో కరెంటు తీగలు తెగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుడు పసివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీను(60)గా గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.

News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

News April 5, 2026

ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

15 చోట్ల కల్తీ పాలు..!

image

కల్తీ పాల నివారణకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో పశు సంవర్ధక, ఫుడ్ సేఫ్టీ విభాగాలు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 705 పాల నమూనాలను పరీక్షించగా, 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు టి.శ్రీనివాస రావు, కె.సుప్రియ వెల్లడించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని తెలిపారు.

News April 4, 2026

నేలకోట నుంచి పూడిపల్లికి.. పులి సంచారంతో భయం భయం!

image

నాలుగు రోజులుగా నేలకోట, పెదకొండేపూడిలో మకాం వేసిన పులి శనివారం మళ్లీ పూడిపల్లి చేరింది. గంగవరం, రంపచోడవరం కొండల మీదుగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళుతోందని ఏలూరు రేంజ్ అటవీ అధికారి తెలిపారు. గతంలో అమర్చిన ట్రాకింగ్ పరికరం ద్వారా దీని కదలికలను గమనిస్తున్న రెస్క్యూ బృందాలు పోశమ్మగండి మీదుగా పూడిపల్లి చేరుకున్నాయి. పులి సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 4, 2026

భర్తతో గొడవ.. గోదావరిలోకి దూకేద్దామని..!

image

భర్తతో గొడవపడి గోదావరిలో దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కాపాడారు. శుక్రవారం రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గోదావరిలో దూకడానికి ప్రయత్నించిన మహిళను శక్తి టీం పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ఈ మహిళ భర్తతో గొడవపడి చనిపోవడానికి వచ్చింది. ఆమె కదలికలను గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చెప్పగా వారు వచ్చి రక్షించారు.