EastGodavari

News April 4, 2026

రాజమండ్రి: ‘వేడుకలకు హాజరవ్వాలి’

image

డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఏప్రియల్ 5 న, అంబేడ్కర్ 135వ జయంతి ఏప్రిల్ 14 వేడుకలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూ. గో జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నగరంలో జరిగే ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

రాజమండ్రి: ఏప్రిల్ 6 నుంచి పది మూల్యాంకనం

image

పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ )సోమవారం నుంచి బీవీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరుగనుందని డీఈవో కంది వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం బీవీఎమ్ పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్పాట్ వాల్యూయేషన్‌లో పనిచేయుటకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్‌లు‌గా నియమించడం జరిగిందన్నారు.

News April 3, 2026

నిడదవోలులో మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

image

ఏపీ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నిడదవోలుకు వచ్చారు. ఆయనకు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆత్మీయంగా పలకరించారు. ముందుగా పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఒకే చోట జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కలవడంతో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

News April 3, 2026

కల్తీ పాలపై ఉక్కుపాదం: కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అనధికారిక పాల విక్రయాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాలను అరికట్టేందుకు పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా FSSAI వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యమైన పాలు మాత్రమే విక్రయించాలని ఆమె స్పష్టం చేశారు.

News April 3, 2026

తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC/UPHC) సేవలలో తూ.గో. జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు DMHO కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం బొమ్మూరులోని కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సానుకూల అభిప్రాయం ఫిబ్రవరిలో 74.8\% ఉండగా, మార్చిలో అది 77.8%కి పెరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు.

News April 3, 2026

తూ.గో: పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీపీఓ వి.శాంతమణి అధికారుల జాబితాను విడుదల చేశారు. నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News April 3, 2026

రాజమండ్రిలో 4న జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో ఈనెల 4వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వికాస కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.