EastGodavari

News April 3, 2026

రాజమండ్రిలో 4న జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో ఈనెల 4వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వికాస కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 2, 2026

హాస్టల్‌కు వెళ్లిన కలెక్టర్ కీర్తి చేకూరి.. కారణం ఇదే!

image

అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో గురువారం రాత్రి కలెక్టర్ కీర్తి చేకూరి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. కలెక్టర్ రాకతో వసతి గృహంలో సందడి నెలకొంది.

News April 2, 2026

వరి నుంచి ఆయిల్ పామ్‌కు మారండి: DAO రాబర్ట్ పాల్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో APCNF, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ సూచించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News April 2, 2026

అమరావతికి చట్టబద్ధత.. పురందీశ్వరి హర్షం

image

అమరావతి ఏపీ ఏకైక రాజధానిగా పార్లమెంట్‌లో చట్టబద్ధత లభించడంపై ఎంపీ పురందీశ్వరి హర్షం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలలో బిల్లుకు ఆమోదం లభించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దక్కిన విజయమని గురువారం పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News April 2, 2026

YCP కాదు.. ‘వనభోజనం’ పార్టీ అని పెట్టుకో: MLA గోరంట్ల సెటైర్..!

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ట్విటర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు. పార్టీలోని ముఖ్య నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్‌లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని వనభోజనంలా భుజించారని విమర్శిస్తూ, ‘వనభోజనం పార్టీ’గా పేరు మార్చుకోవాలని సూచించారు.

News April 2, 2026

రాజమండ్రిలో బడ్జెట్ 2026-27 ఔట్‌రీచ్ ప్రోగ్రామ్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో బడ్జెట్ 2026-27 ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాల పురోగతి, బడ్జెట్ కేటాయింపులను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. కలెక్టర్ కీర్తీ చేకూరి, జేసీ మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 2, 2026

పెదకొండేపూడి గోశాల వెనుక కొండపై పులి విశ్రాంతి: రేంజర్

image

సీతానగరం మండలం పెదకొండేపూడిలో గోశాల వెనుక నేలకోట కొండపై గురువారం ఉదయం పులి ఉన్నట్లు ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ రేంజర్ దావీదురాజు తెలిపారు. గోకవరం, ఇందుకూరు, రాజమహేంద్రవరం నుంచి మూడు బృందాలతో ప్రస్తుతం పెదకొండేపూడిలో వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. రేంజర్ కొండలరావు మాట్లాడుతూ.. పగటి సమయంలో పులి పూర్తి విశ్రాంతి తీసుకుంటుందని ఈరోజు రాత్రికి దాని కదలికలు తెలుస్తుందన్నారు.

News April 2, 2026

కొవ్వూరు: గోదావరి ఒడ్డున మహిళ మృతదేహం లభ్యం

image

కొవ్వూరు సమీప గోదావరి ఒడ్డున కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన చెరుకూరి సూర్యచక్ర(30) మృతదేహం లభ్యమైంది. గత నెల 21న ఇద్దరు కుమార్తెలతో కలిసి గౌరీపట్టణం మేరీ మాత ఉత్సవాలకు వచ్చిన ఈమె, తిరిగి ఇంటికి చేరలేదు. బుధవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, ఆమెతో ఉన్న ఇద్దరు పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2026

తూ.గో: నేడు ఉదయం 10 గంటలకు..!

image

2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆదేశించారు. ఈ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామా నాయుడు, మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారని తెలిపారు. బడ్జెట్ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

News April 2, 2026

తూ.గో: నేడు ఉదయం 10 గంటలకు..!

image

2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆదేశించారు. ఈ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామా నాయుడు, మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారని తెలిపారు. బడ్జెట్ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.