India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి SA-1 పరీక్షల్లో లెక్కల పేపర్ లీక్‌కు కారణమైన ఉమ్మడి తూ.గో.(D) రామచంద్రపురం మండల విద్యాశాఖాధారితోపాటు టీచర్ సుబ్బారావును విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో సోమవారం హాజరుపరచగా రిమాండ్ విధించారు. మండలంలోని హైస్కూల్‌లో ఓ విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని ఆయన ఇవ్వగా.. బాలిక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్షమవడంతో విషయం తెలిసింది.
కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను రప్పించి వారితో డీలర్లు మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి తూ.గో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019లో 19 నియోజకవర్గాల్లో YCP 14, TDP 4, జనసేన ఒక స్థానంలో నెగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లతో పాటు మొత్తం 19 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక్కడి నుంచి గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం కావడం విశేషం.
తూ.గో జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజమండ్రి జేఎన్ రోడ్‌లో హ్యాపీ స్ట్రీట్ దగ్గర్లో గల ఓ స్పా సెంటర్‌లో ఆదివారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసు స్టేషన్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులను ఆరుగురు బాధిత యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నేడు కలెక్టరేట్‌లలో జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్, ప్రశాంతి, మహేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశారు. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని కలెక్టర్లు ఆదేశించారు.
కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం డిప్యూటీ సీఎం Pawan Kalyan దృష్టికి వచ్చింది. రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదరిని ఆయన ఆదేశించారు.
రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించే సాహస యాత్రను సామర్లకోటకు చెందిన శ్యామల గోలి అనే మహిళ ప్రారంభించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల ప్రణాళిక రూపొందించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. మండపేట, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు తదితర ప్రాంతాల్లో 4 రోజులకు రూ.వేలల్లో అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.
Sorry, no posts matched your criteria.