EastGodavari

News July 7, 2024

కాకినాడ: క్షుద్రపూజలని అనుమానం.. అర్ధరాత్రి గొడవ

image

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలో పోలవరం కాలువ గట్టు వద్ద కొన్నిరోజులుగా సంచార జాతులకు చెందిన కొందరు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వారు ఒక ఎనుబోతును బలిఇచ్చి పూజలుచేస్తుండగా స్థానికులు గుర్తించి ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగి సంచారజాతులకు చెందిన ఓ వ్యక్తి స్థానికుడిపై కత్తితో దాడి చేశాడు. తుని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. విచారణ చేపట్టారు.

News July 7, 2024

ఎంపీ పురందీశ్వరిని కలిసిన తూ.గో. కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రి MP దగ్గుబాటి పురందీశ్వరిని స్థానిక జేఎన్ రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృద్ధి, తదితర అంశాలపై వారు చర్చించారు.

News July 6, 2024

తూ.గో.: గోదారిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఐ.పోలవరం మండలంలోని యానాం-ఎదురులంక బాలయోగి వారధి పైనుండి ఓ మహిళ గోదావరిలో దూకి శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సకాలంలో మత్స్యకారులు సాయం అందించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆమెను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన గుత్తుల పద్మ కుమారిగా పోలీసులు గుర్తించారు.

News July 6, 2024

అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. ఘటనా స్థలానికి మంత్రి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఘటనాస్థలాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. దోషులను వెంటనే శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

News July 6, 2024

తూ.గో.: సహచర మంత్రులతో కందుల దుర్గేశ్ భేటీ

image

విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాల కోసం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సహచర మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లతో కందుల దుర్గేశ్‌ భేటీ అయ్యారు. IAS అధికారి ప్రేమ్ చంద్రారెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించారు.

News July 6, 2024

రూ.90 నాణేన్ని సేకరించిన అమలాపురం వాసి

image

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఏర్పడి 9 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కోల్‌కతాలో మొట్ట మొదటిసారి రూ.90 నాణేన్ని ముద్రించారు. ఆ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఆ నాణెం 40 గ్రాముల బరువు ఉండి, పూర్తిగా వెండితో తయారు చేసి ఉన్నట్లు తెలిపారు. నాణేనికి ఒక వైపు రూ.90 ముఖ విలువ, మరో వైపు రిజర్వ్ బ్యాంక్‌ చిహ్నం ముద్రించి ఉందని కామేశ్వర్ చెప్పారు.

News July 6, 2024

కాకినాడ: గేదెను బలిచ్చి క్షుద్ర పూజలు

image

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ గేదె దూడను బలి ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రశ్నించిన గ్రామస్థుడిపై సదరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వారిలో ఓ వ్యక్తిని పట్టుకొని స్థానికులు చితక్కొట్టారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2024

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ వద్ద DEAD BODY

image

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ 5వ నంబరు ప్లాట్‌ ఫామ్‌పై 35 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడని జీఆర్పీ ఎస్‌ఐ మావుళ్లు శుక్రవారం తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు రంగు, తెలుపు రంగు చారలు కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. కుడిచేతి మీద లవ్‌ సింబల్‌‌లో R అనే పేరుతో పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 94406 27551 నంబర్‌కు సంప్రదించాలని SI కోరారు.

News July 6, 2024

GOOD NEWS.. కాకినాడలో 8న అప్రెంటీస్ మేళా

image

ఉమ్మడి తూ.గో జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటీస్ ఖాళీలు భర్తీ చేయడానికి ఈనెల 8న కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా-జులై 2024 నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.వి.జి.వర్మ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడ్లలలో శిక్షణ పూర్తి చేసుకుని ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.

News July 6, 2024

తూ.గో: ఉరేసుకుంటున్నానంటూ ప్రియుడికి వీడియో కాల్

image

నిడదవోలుకు చెందిన 22ఏళ్ల యువతి తాడేపల్లిగూడెంలో నర్సుగా పనిచేస్తుంది. కపిలేశ్వరపురానికి చెందిన రాజేశ్, సదరు యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజేశ్‌కి ఏడాది కింద పెళ్లైంది. అయినా వీరి ప్రేమ కొనసాగింది. తనను 2వ పెళ్లి చేసుకోవాలని యువతి రాజేశ్‌ను కోరగా.. పెద్దలు అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు. ఆమె బంధువులు తిరస్కరించగా.. ప్రియుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.