India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు కలెక్టర్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు విజన్-2047పై దిశా నిర్దేశం చేశారు.
తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రానికి చెందిన దామోదర లలిత జ్యోతి వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన శశి క్లాసెస్ సంస్థ దేశవ్యాప్తంగా జూన్ 26న ఆన్‌లైన్‌లో నిమిషంలో ఎక్కువ ఆర్గానిక్ సబ్బుల తయారీపై పోటీ నిర్వహించారు. కాగా 27 మంది బృందంగా ఏర్పడి 2008 సబ్బులు తయారుచేశారు. వీరిలో లలిత ఒకరు. కాగా ఆమె ఆదివారం వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్ నుంచి మెడల్ అందుకున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూ.గో, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
SHARE IT..
అరాచక వైసీపీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ తాను ఎన్నికల ముందు మొక్కుకున్నానని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు మురళి వీరభద్రరావు తెలిపారు. ఆదివారం కాకినాడలోని ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మకు సగం మొక్కును చెల్లిస్తూ సగం గుండు కొట్టించుకున్నారు. మరో సగం సోమవారం తిరుపతి పుణ్యక్షేత్రంలో చెల్లిస్తానన్నారు.
రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట అటవీ ప్రాంతంలోని వట్టిగడ్డ రిజర్వాయర్‌లో పెద్దపెద్ద రొయ్యలు కనిపిస్తున్నాయి. ఆదివారం మత్స్యకారుల వలకు భారీ రొయ్య చిక్కింది. కిలోకు 10 రొయ్యలు మాత్రమే వస్తుండగా ధర రూ.350గా పలుకుతోంది. భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తిగా నిండటంతో నీరు తగ్గేవరకు రొయ్యల వేట వీలుకాదని మత్య్సకారులు చెబుతున్నారు.
రాజోలు మండలం పొన్నమండలో గత నెల 30న నిర్లక్ష్యంగా బైక్ నడిపిన రిజర్వ్‌డ్ SI లెనిన్‌పై కేసు నమోదైంది. మనవడితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఆయన తన వాహనాన్ని ఢీ కొట్టినట్లు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని SI పృథ్వీ చెప్పారు. లెనిన్ సోదరుడు స్టాలిన్ ఓ యువతిని మోసం చేసిన కేసులో నిందితునిగా ఉండగా.. తాను బాధితురాలికి అండగా నిలవడంతో ఇలా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఓ సచివాలయ ఉద్యోగి సహోద్యోగినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసినట్లు SI చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ధోనిపాటి రాంజీ పెన్షన్ల నెపంతో సహోద్యోగిని ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశామన్నారు.
ఉమ్మడి తూర్పు గోదారోళ్లు స్నేహమంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. ఇక పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు..? ☞ Happy Friendship Day
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ కోసం ఈ నెల 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. రిజిస్ట్రేషన్ ఫారంతో పాటు టెన్త్, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్ తదితర ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు.
రాజమండ్రిలో YCP భవనం కూల్చివేతకు మున్సిపల్ కమిషనర్ జులై 22న ఉత్తర్వులిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి, YCP జిల్లాధ్యక్షుడు జక్కంపూడి రాజా హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. మున్సిపాలిటీ నుంచి అనుమతి కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఆ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.