Guntur

News May 16, 2024

జంగా కృష్ణమూర్తిపై అర్ధరాత్రి వేటు.. గతంలోనే ఆ పదవి నుంచి తొలగింపు

image

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అర్ధరాత్రి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా, ఈయన శాసనమండలిలో విప్‌గా పని చేశారు. ఈ సమయలో వైసీపీపై విమర్శలు చేస్తూ.. తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన కొంతకాలానికే ఆయన్ను విప్ పదవి నుంచి తొలగించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై తాజా నిర్ణయం వెలువడింది.

News May 16, 2024

తెనాలి: తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె

image

తల్లి ఇంటికి కుమార్తె నిప్పు పెట్టింది. పోలీసులు ఏమన్నారంటే.. తెనాలిలోని చెంచుపేటలో రోశమ్మ పూరింట్లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు సుజాతకు వివాహం కాగా, భర్తకు దూరమై మరో వ్యక్తితో ఉంటోంది. రోశమ్మ ఇద్దరు మనవరాళ్లను(12,14 ఏళ్లు) తన వద్దే ఉంచుకొని పెంచుతోంది. కూతుళ్లను తల్లి తన వద్దకు పంపట్లేదనే కోపంతో సుజాత తల్లి ఇంటికి నిప్పు పెట్టింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 16, 2024

తుళ్లూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మండలంలో వెలగపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, వెలగపూడి గ్రామానికి చెందిన రత్తయ్య(50) వెలగపూడి మరనాత చర్చి వద్ద రోడ్డు దాటుతుండగా రాష్ట్ర సచివాలయం వెనుక వైపు నుంచి చిప్స్ లారీతో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రత్తయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

News May 15, 2024

తుళ్ళూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మండలంలో వెలగపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, వెలగపూడి గ్రామానికి చెందిన రత్తయ్య(50) వెలగపూడి మరనాత చర్చి వద్ద రోడ్డు దాటుతుండగా రాష్ట్ర సచివాలయం వెనుక వైపు నుంచి చిప్స్ లారీతో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రత్తయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

News May 15, 2024

గుంటూరులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. గ్రామ శివారులోని నేషనల్ హైవే పక్కన జిపి ఆయిల్ మిల్ సమీపంలోని కాళీ స్థలం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.

News May 15, 2024

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి 

image

గుంటూరు రాజాగారితోటలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బాలికల సంక్షేమ వసతి భవనానికి సమీపంలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్నారు. మృతుని పేరు, వివరాలు తెలియలేదని, అనారోగ్యంతో చనిపోయి ఉంటాడని పోలీసులు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News May 15, 2024

గుంటూరు: ఎన్నికల ఫలితాలపై రూ.లక్షల్లో పందేలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ ముగియగా.. జూన్ 4న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పందేలు జోరందున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు వచ్చే సీట్లపై, అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ గెలుపు, మెజార్టీలపై రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

News May 15, 2024

పిడుగురాళ్లలో 3 రోజులు వ్యాపార కార్యకలాపాలు బంద్

image

పిడుగురాళ్లలో 3 రోజులు పాటు వ్యాపార కార్యకలాపాలు బంద్ చేయాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుమిగూడొద్దని, బయటి వ్యక్తులు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ప్రత్యేక మొబైల్ వ్యాన్ ద్వారా ఆదేశించారు. పల్నాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు పై విధంగా చెబుతున్నారు.

News May 15, 2024

బాపట్ల జిల్లాలో రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్, ఎస్పీ

image

బాపట్ల జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

News May 15, 2024

పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ ప్రత్యేక కమిటీ

image

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏడుగురితో ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.