India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

తెనాలి టీచర్స్ కాలనీలో జరిగిన షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యకేసు మిస్టరీ వీడుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫయాజ్ సహజీవనం చేస్తున్న ఓ మహిళ సహా హత్యకు పాల్పడిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన మహిళ ముత్యంశెట్టిపాలెంకి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఫయాజ్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది.

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనివాసులు స్థానంలో కె.మయూర్ అశోక్ గుంటూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మయూర్ అశోక్ విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.