Guntur

News January 10, 2026

గుంటూరులో నేటి నుంచి UTF రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

image

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాల వేదికగా నిలవనుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటూ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.

News January 9, 2026

గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

image

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.

News January 9, 2026

పది విద్యార్థులు ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్‌: గుంటూరు కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులు అందరూ ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అవుతారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రోత్సహించారు. SC, ST, BC, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లక్ష్యాలను పెట్టుకుని వాటి విజయానికి కృషి చేయాలని సూచించారు. పరీక్షలపై భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలని తెలిపారు. విద్యార్థులకు విజయం మనదే స్టడీ మెటీరియల్ ఇచ్చారు.

News January 9, 2026

తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

image

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.

News January 8, 2026

GNT: కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా?

image

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా పల్నాడు జిల్లాకు చెందిన కుర్రా అప్పారావు నియామకంపై స్థానిక క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన అర్హులను పక్కనపెట్టి ఇతర జిల్లా నేతకు పదవి అప్పగించడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది స్థానిక క్యాడర్‌కు అన్యాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.

News January 8, 2026

మంగళగిరి పెద్ద రథోత్సవంపై గ్రహణం నీడ.. ఊరేగింపు జరిగేనా.?

image

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టంపై సందిగ్ధత నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే పెద్ద రథోత్సవం మార్చి 3వ తేదీన జరగాల్సి ఉంది. అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో రథోత్సవం నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. గ్రహణం కారణంగా ఇప్పటికే TTD సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ మార్చి 3న మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆగమ శాస్త్ర పండితుల సలహాల కోసం దేవాలయ అధికారులు వేచి చూస్తున్నారు.

News January 8, 2026

తెనాలి: విద్యార్ధి ఆత్మహత్యకు కారణలివేనా?

image

వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెనాలి(M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకుని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.

News January 8, 2026

గుంటూరులో నేడు సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు జనవరి 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అమరావతిలోని సెక్రటేరియట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా గుంటూరుకు రాగా, నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో నిర్వహించే సరస్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్‌లో ‘ఆవకాయ-అమరావతి’ కార్యక్రమానికి హాజరై రాత్రి తిరిగి నివాసానికి చేరుకుంటారు.