Guntur

News January 12, 2026

GNT: వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

image

వివేకానంద జీవితం యువతకు స్పూర్తిదాయకమని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వివేకానంద చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మిక, తాత్విక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అన్నారు. యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహోన్నత ఆలోచనావేత్త అని పేర్కొన్నారు.

News January 12, 2026

GNT: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక!

image

గుంటూరు జిల్లాలో 1991 జనవరి 12న జన్మించిన ద్రోణవల్లి హారిక అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి. చిన్నవయసులోనే అండర్-9, 10, 14, 18 విభాగాల్లో ప్రపంచ స్థాయి పతకాలు సాధించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ హోదాలను దక్కించుకుంది. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2012, 2015, 2017) కాంస్య పతకాలు గెలిచింది. ఆమె ప్రతిభకుగాను కేంద్రం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

News January 11, 2026

GNT: ‘చిరు’ సినిమా హిట్ అవ్వాలని అంబటి ట్వీట్!

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అభిమాన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై మరోసారి తన అభిమానాన్ని X వేదికగా చాటుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్” చిత్రం విడుదల సందర్భంగా X వేదికగా ఆదివారం అంబటి రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా సూపర్, డూపర్ హిట్ అవ్వాలని అంబటి ఆకాంక్షించారు.

News January 11, 2026

రేపు తెనాలి ఐటీఐలో అప్రెంటిస్ మేళా..15 కంపెనీల రాక

image

తెనాలి చినరావురులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటిఐ పాసైన విద్యార్థులందరికీ అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హత కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డు నకలుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు.

News January 10, 2026

GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

image

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

News January 10, 2026

నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

image

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్‌లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్‌తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News January 10, 2026

GNT: మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్‌మెంట్‌పై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News January 10, 2026

GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

image

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.

News January 10, 2026

తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

image

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

News January 10, 2026

VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

image

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.