Guntur

News January 18, 2026

సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

image

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.

News January 17, 2026

ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

image

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 17, 2026

వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

image

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం‌ జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.

News January 17, 2026

GNT: కలెక్టర్‌ని కలిసిన జీఎంసీ కమిషనర్

image

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్‌ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.

News January 16, 2026

GNT: డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు జాక్‌పాట్

image

17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్‌పాట్”గా అభివర్ణిస్తున్నారు.

News January 15, 2026

సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

image

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.

News January 15, 2026

GNT: రంగస్థల దిగ్గజం మొదలి నాగభూషణశర్మ

image

గుంటూరు (D) ధూళిపూడిలో 1935 జులై 24న జన్మించిన మొదలి నాగభూషణశర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. సుమారు 70కి పైగా నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రచించారు. సాహిత్యం, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (2013) వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019 జనవరి 15న తెనాలిలో మరణించారు.

News January 15, 2026

సంక్రాంతి.. కోళ్లను ఇలా గుర్తించండి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చరిత్రలో కోడి పందేలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
#డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.
#కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.
#నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.
#పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.
#అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.
#సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.

News January 15, 2026

కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

image

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.

News January 15, 2026

GNT: జీఎంసీ నేటి సంక్రాంతి సంబరాలు ఇవే!

image

గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ స్థలంలో ఉదయం 9 గంటల నుంచి పొంగళ్లు, కోడి పందేలు, కర్రసాము, ఖోఖో, సాయంత్రం 5 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రి, బహుమతుల ప్రదానం జరగనుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం NTR స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి మ్యూజికల్ నైట్ ఉంటుంది.