Guntur

News January 22, 2026

GNT: ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య.. పోలీసుల అదుపులో నిందితులు

image

దుగ్గిరాల(M) చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రియురాలు సహా ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి మాధురి, ప్రియుడు గోపిలను దుగ్గిరాల ఎస్సై వెంకట రవి విచారిస్తున్నారు. భర్తను చంపిన తర్వాత డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. దిండుతో ఊపిరాడకుండా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మబలికిన విషయం తెలిసిందే.

News January 22, 2026

గుంటూరు జిల్లాలో 22 రేషన్ షాపులపై కేసులు

image

రేషన్ మాఫియా అక్రమాలను అరికట్టడానికి జిల్లా సివిల్ సప్లై యంత్రాంగం పకడ్బందీగా పని చేస్తోందని ఆ శాఖ జిల్లా అధికారి కోమలి పద్మ తెలిపారు. అక్టోబరు నుంచి జిల్లాలో 22 రేషన్ షాపుల మీద 6A కేసులు, 4 క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిపై చర్యలకు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న 763 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 6A కేసులు 31, క్రిమినల్ కేసులు 28 నమోదు చేశామన్నారు.

News January 22, 2026

GNT: మూడేళ్ల పరారీకి చెక్.. అత్యాచార నిందితుడు అరెస్ట్

image

అత్యాచార కేసులో నిందితుడిగా ఉండి 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏటీ అగ్రహారం 2వ లైనుకు చెందిన ఊదర నరసింహారావు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని సీఐ సత్యనారాయణ చెప్పారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ణి పట్టుకున్నామని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదని హెచ్చరించారు.

News January 20, 2026

ANU: ఫిబ్రవరి 3 నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. బీపీఈడీ, యుజీ పీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

News January 20, 2026

పశు ఔషది విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు : కలెక్టర్

image

జిల్లాలో పశు ఔషది విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన జనరిక్ మందులను అందించడం కోసం.”పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు.

News January 20, 2026

ఇంటర్మీడియట్ పరీక్షలు ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధత, నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, సమీప ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, పోలీస్ శాఖతో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

News January 19, 2026

అమరావతి రైతులకు ఒకే చోట ప్లాట్లు

image

అమరావతి భూసేకరణ రెండో దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 20,494 ఎకరాల సేకరణలో భాగంగా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ఒకే చోట కేటాయించనున్నారు. గతంలోలా వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా, ఒకే క్లస్టర్‌లో వీటిని ఇవ్వనున్నారు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పనులు వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రైతులకు త్వరగా ప్లాట్లు అప్పగించే వీలుంటుందని అధికారులు తెలిపారు.

News January 19, 2026

గణతంత్ర వేడుకలకు సిద్దం కావాలి: కలెక్టర్

image

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకల పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.

News January 19, 2026

GNT: ఈ-క్రాప్‌కు కొత్త నిబంధనలు.. రైతులకు ఊరట

image

గుంటూరు జిల్లాలో రైతులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ-క్రాప్ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో నమోదు సరిగా కాక చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రబీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. రైతు సమక్షంలోనే పొలంలో నమోదు చేయాలని ఆదేశించింది. సాగు భూమితో పాటు ఖాళీ భూములను కూడా ల్యాండ్ పార్శిల్‌గా నమోదు చేస్తున్నారు.

News January 18, 2026

రెవెన్యూ క్లినిక్‌లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.