Guntur

News January 25, 2026

ప్రజాస్వామ్యానికి ఓటే పునాది: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి ఓటులోనే ఉందని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆమె గుర్తుచేశారు.

News January 24, 2026

గుంటూరులో రేపు 10k వాక్

image

గుంటూరు నగరంలో ఆదివారం 17వ 10k వాక్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఉదయం 6 గంటలకు రింగ్ రోడ్డులోని ఇండియన్ స్ర్పింగ్స్ స్కూల్ వద్ద నుంచి వాక్ ప్రారంభం అవుతోంది. సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్నా జఠ్మలానీ, హాస్యనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

News January 24, 2026

అమరావతిలో గణతంత్ర వేడుకల రిహార్సల్స్

image

అమరావతి రాజధానిలో గణతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ శనివారం అట్టహాసంగా జరిగాయి. సీఎస్ శ్యామలరావు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కవాతును పర్యవేక్షించారు. పోలీస్, ఆర్మీ, ఎన్‌సీసీ బలగాల విన్యాసాలు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనవరి 26న వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.

News January 24, 2026

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన DGP

image

అమరావతి ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డాక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ఆ ప్రాంతంలో ప్రాక్టీస్ పెరేడ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర విషయాల గురించి స్థానిక అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News January 24, 2026

GNT: సినీ సంగీత పితామహుడు బి.ఎన్.ఆర్ జయంతి

image

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఆద్యులైన భీమవరపు నరసింహారావు జయంతి నేడు. గుంటూరు జిల్లా కొలకలూరులో 1905 జనవరి 24న ఆయన జన్మించారు. చిన్ననాడే సంగీతంపై మక్కువతో స్వయంగా హార్మోనియం నేర్చుకున్నారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యారు. 1936లో ‘సతీ తులసి’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించి మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రౌపదీ వస్త్రాపహరణం, అర్ధాంగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు.

News January 24, 2026

తుళ్లూరు: వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు

image

ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధిలో భాగంగా ఏపీ సీఎం CBN పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభించి వీధి వ్యాపారులకు అందజేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ. 206 కోట్ల రుణం పంపిణీ చేశారు. వీధి వ్యాపారును ఆర్థికంగా బలోపేతం చేయటమే ఈ పథకం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో MEPMA డైరెక్టర్ వాకాటి కరుణ ఐఏఎస్ పాల్గొన్నారు.

News January 24, 2026

ప్లాట్‌ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

image

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్‌ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్‌లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్‌ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్‌లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

News January 24, 2026

ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

News January 24, 2026

ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

News January 23, 2026

GNT: సమగ్రశిక్షలో ఖాళీకి దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు సమగ్రశిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ ఖాళీ భర్తీకి ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం డిప్యూషన్ పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు DEO సలీమ్ బాషా తెలిపారు. 55 సం.ల లోపు కలిగిన ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 5సం.ల సర్వీస్, సెకండరీ గ్రేడ్ టీచర్లు 8 సం.ల సర్వీస్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.