India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.

డా. BR అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జూనియర్ ఇంటర్‌తో పాటు 6 నుంచి 10 తరగతుల్లో బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడవితక్కెళ్లపాడు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఆసక్తి గల వారు apgpcet.apcfss.inలో నమోదు చేసుకోవాలన్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జాతీయ పండుగ కారణంగా ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.

@VVIP, AA, A1, A2 పాసులు, రైతులు లోటస్ – కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం – సీడ్ యాక్సెస్ రోడ్ – ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి
@బి1, బి2 పాస్ హోల్డర్స్, రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి
@ గుంటూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి E8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం – వెలగపూడి గ్రామం మీదుగా వెళ్లాలి.

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రేపు 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నందున జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహణను సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమై ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే PGRS, రెవెన్యూ క్లీనిక్‌ని రద్దు చేశామని అన్నారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నగర ప్రజలు విషయాన్ని గమనించి ఏదైనా సమస్యలు ఉంటే 0863 2345103కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

మిర్చి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది మార్కెట్ ధరలు ఊరటనిస్తున్నాయి. వాతావరణం అనుకూలించి తెగుళ్లు తగ్గడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉండటమే కాకుండా, ధరలు కూడా పెరిగాయి. గుంటూరు మిర్చి యార్డులో 2 నెలల క్రితం క్వింటా రూ.15 వేలు ఉన్న US-341 రకం, రూ.23 వేలకు చేరుకుంది. అదే విధంగా తేజ రకం మిర్చి కూడా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. పెరిగిన ధరలతో లాభాలు వస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారత గణతంత్ర చరిత్రలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు పునాది వేసిన రాజ్యాంగ సభలో జిల్లాకు చెందిన దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఎన్.జి.రంగా వంటి మహనీయులు కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి గుంటూరు కంచుకోటగా నిలిచింది. ఆనాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, నేడు 77వ గణతంత్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతిలో జరగనుండటం విశేషం.
Sorry, no posts matched your criteria.