Guntur

News January 29, 2026

GNT: తల్లి మెడలో గొలుసు లాక్కొని.. ప్రియుడితో యువతి పరార్‌!

image

కన్నతల్లి అని కూడా చూడకుండా మెడలోని బంగారం లాక్కొని ఓ యువతి ప్రియుడితో పరారైన ఘటన గుంటూరులో కలకలం రేపింది. మల్లికార్జునపేటలో నివసించే సదరు యువతి గతంలోనే నగలతో ఇంట్లోంచి వెళ్లగా, తిరిగి ఈ నెల 28న వచ్చి తల్లి మెడలోని నానుతాడు లాక్కొని ఉడాయించింది. బాధితురాలి ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News January 29, 2026

GNT: హిందీ పండిట్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు అరండల్‌పేటలోని ఆదివాసీ రెసిడెన్షియల్‌ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ హిందీ పండిట్‌ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి (DEO) షేక్‌ సలీం బాషా కోరారు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.

News January 29, 2026

రాజధానిలో మొదలుకానున్న NIACL కార్యకలాపాలు

image

అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో దేశంలో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ  NIACL ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనుంది. కార్యాలయ స్థాపన ద్వారా NIACL అమరావతిలో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాక.. అమరావతిలో టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. దీనికి సంబంధించి ఒప్పందం బుధవారం పూర్తయింది.

News January 28, 2026

GNT: ‘చంద్రబాబు రాక..వైసీపీ నిరసన వాయిదా!

image

అంజుమన్ ఆస్థుల అన్యాక్రంతంపై వైసీపీ ఈ నెల 30న నిర్వహించనున్న నిరసన ర్యాలీ వాయిదా వేసినట్లు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తెలిపారు. 30న CMచంద్రబాబు GGHలో నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో నగరంపాలెం ఈద్గా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న ర్యాలీని ఫిబ్రవరి 6వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు.

News January 28, 2026

GNT: కాల్పుల కేసు కొట్టివేత.. 13 మంది నిందితుల విడుదల

image

2010 జులై 5వ తేదీన ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగిన పాలపాటి సత్యనారాయణ @ సత్యం (52) హత్య కేసు కొట్టివేస్తూ గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి నాగరాజ బుధవారం తీర్పు చెప్పారు. 113 తాళ్లూరుకి చెందిన సత్యంకు, చిలకలూరిపేటకు చెందిన మల్లెల సత్యనారాయణతో కుటుంబ వివాదం ఉంది. దానిని పరిష్కరించుకునే క్రమంలో ఐబికి వచ్చిన సత్యంపై మల్లెల అనుచరులు కాల్పులు జరిపి హతమార్చారని సీఐడీ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు.

News January 28, 2026

గుంటూరు జోన్‌లో 23 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

image

గుంటూరు జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 23 ఫార్మసీ అధికారి (ఫార్మసిస్ట్ గ్రేడ్–II) పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు చేపట్టనుంది. దరఖాస్తులను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు ఆర్‌డీఎంహెచ్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు పేర్కొంది.

News January 28, 2026

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని DEO సలీం భాష ఉపాధ్యాయులకు సూచించారు. కేఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, హిందూ, యాదవ హైస్కూల్, నల్లపాడు ZPస్కుల్స్‌ని బుధవారం DEO ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ అందించే చిక్కీలు, కోడిగుడ్లపై గడువును పరిశీలన చేస్తూ ఉండాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని చెప్పారు.

News January 28, 2026

రెవెన్యూ సేవలు మెరుగు పర్చాలి: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ సేవల పై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మెరుగుపర్చాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అధికారుల వర్క్ షాప్‌లో కలెక్టర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తాజాగా అనేక సర్కూలర్స్ జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News January 28, 2026

గుంటూరు: ఈ నెల 30న GGHకి సీఎం చంద్రబాబు

image

గుంటూరు జీజీహెచ్‌లో జింఖానా సహకారంతో నిర్మించిన కానూరి–జింఖానా మాతా శిశు సంరక్షణ భవనాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News January 28, 2026

GNT: వెస్ట్ బైపాస్‌తో ట్రాఫిక్‌కు ఊరట

image

సంక్రాంతి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డులో ఒక భాగం అందుబాటులోకి రావడంతో గుంటూరు–మంగళగిరి మధ్య ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. కాజ నుంచి గుంటుపల్లి వరకు 3లేన్ల రహదారి తెరుచుకోవడంతో భారీ వాహనాలను బైపాస్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాల్లో జామ్‌లు తగ్గాయి. రెండు జిల్లాల పోలీసులు కాజ జంక్షన్ వద్ద నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్చి నాటికి మిగిలిన మార్గం పూర్తైతే సమస్య తీరనుంది.