India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లాలో మిరప పంటపై నల్ల తామర, తెల్ల దోమ ఉధృతి తీవ్రంగా పెరిగింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పురుగులు అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. పూత, కాయ దశలో తామర రసం పీల్చడంతో ఆకులు మాడిపోతూ, పువ్వులు రాలిపోతున్నాయి. లేత కాయలు గిడసబారి రంగు మారుతున్నాయి. ఎకరాకు 5 క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా. పెరిగిన సాగు ఖర్చులు, సరైన మందులు లేకపోవడం రైతులను మరింత కుంగదీస్తోంది.

అమరావతి ప్రాంతంలో ఉద్దండ రాయిని పాలెం సమీపంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే CM చంద్రబాబు సూచనల మేరకు మరో రెండు భవనాలు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ రాయపూడి లో జరిగిన గ్రామసభలో చెప్పారు. రెండు భవనాలలో ఒకటి హైదరాబాదులోని హైటెక్ సిటీ మాదిరిగా 40 అంతస్తులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. తమ దరఖాస్తులను గుంటూరు జిల్లా కోర్టులో అందే విధంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లో పంపించాలన్నారు. పోస్టులు, విద్యార్హత, ఇతర వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్‌ను http//Guntur.dcourts.gov.in ద్వారా పొందవచ్చని అన్నారు.

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

APSRTC ITI అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్‌సైట్‌లోని రిక్రూట్మెంట్ ట్యాబ్‌లో విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు ఎంపికైన అభ్యర్థులు JAN 28న అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయం, గుంటూరులో హాజరుకావాలి. హాజరు కాని వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్ ఎంపిక జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి మాలతి తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయం అయినప్పటికీ, స్వాతంత్ర్యం తర్వాత మన రాష్ట్రపతి, గవర్నర్లు దీనిని అధికారికంగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలో పాలకులు, ప్రముఖులు, అధికారులతో గవర్నర్ తేనీటి విందులో పాల్గొంటారు. తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పొన్నూరు(M) బ్రాహ్మణకోడూరు MPPS 1వ తరగతి విద్యార్థి షేక్ సమాన్ మాలిక్ రాష్ట స్థాయిలో చేతిరాత పోటీలలో ప్రథమ స్థానం పొందాడు. క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో గుంటూరులో విద్యార్థి సమాన్ మాలిక్‌ను DEO సలీం బాషా అభినందించి ప్రశంసా పత్రం, షీల్డ్, రూ. 2 వేల నగదు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థి సమాన్ మాలిక్‌ను పొన్నూరు MEOలు రాజు, విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.