Guntur

News February 9, 2025

ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

image

ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసానిచ్చారు.

News February 9, 2025

గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన 

image

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.

News February 9, 2025

నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

image

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు. 

News February 9, 2025

ప్రయాగరాజ్‌కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు 

image

ఆర్టీసీ గుంటూరు-2 డిపో నుంచి మహాకుంభమేళా (ప్రయాగరాజ్)కు మరో స్పెషల్ బస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షేక్. అబ్దుల్ సలాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న ఏర్పాటు చేసిన బస్సు నిండిపోవడంతో 15వ తేదీన మరో పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 15న ఉదయం 10గంటలకు గుంటూరులో బస్సు బయలుదేరుతుందన్నారు.  

News February 9, 2025

ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేశ్ బాబు

image

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News February 9, 2025

ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేష్ బాబు

image

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News February 8, 2025

దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజ స్తంభాలు కలిగిన దివ్య క్షేత్రం 

image

తెనాలి షరాఫ్ బజారులోని శ్రీసువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజ స్తంభాలు కలిగిన ఏకైక ఆలయంగా విరజిల్లుతోంది. 5 ముఖాలతో స్వామి పూజలందుకుంటున్నారు. 1803లో భాగవతుల అన్నయ్య కుటుంబీకులు ఆలయ నిర్మాణం చేయగా నాటి నుంచి ఈక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. గర్భాలయంలో స్వామివారి 9 అవతార రూపాలు దర్శనమిస్తాయి. నేటి నుంచి వారం పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

News February 7, 2025

గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు. 

News February 7, 2025

ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

image

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. 

News February 7, 2025

గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

image

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.