India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాత గుంటూరు యాదవ బజార్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం తనిఖీ చేశారు. ఓపి, అందులో నమోదైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. నగరంలో డయేరియా నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక పక్క జగన్, మరో పక్కన మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఈ క్రమంలోనే అన్యాయం జరిగితే తిరగబడే స్వభావం అన్నావు, అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు ? అంటూ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. అంబటి తన Xలో శనివారం మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన పీసెట్- 2025కు సంబంధించిన చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రవేశాల కన్వీనర్ పాల్ కుమార్ శనివారం విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 30 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా మారే విధంగా కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. చేబ్రోలు (M) వడ్లమూడి ఓ వర్సిటీలో జరుగుతున్న నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలను శనివారం మాధవ్ సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఈగల్ ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఎంఏ మ్యూజిక్, జర్నలిజం, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, మాస్ట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, తదితర ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.

అంధత్వంతో బాధపడుతూ కుమారుడిని పోషిస్తున్న జ్యోతికి ఉద్యోగ కల్పన జరిగింది. పాతగుంటూరులో నివాసం ఉంటున్న జ్యోతి
గాధ మంత్రి నారా లోకేశ్‌కి తెలియడంతో ఆయన స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ద్య విభాగంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ కల్పన చేస్తూ జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తన కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కుంచాల సౌందరరడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు సుమోటోగా ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తుందని విమర్శించారు. అక్రమ కేసులు, అరెస్టులు, సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. X వేదికగా జగన్ మాట్లాడారు.

వైసీపీ వాలంటీర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌందరరెడ్డి కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘనందన్, టీసీడీ శేఖర్ ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. పోలీసులు చట్టవిరుద్దమైన చర్యలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే సౌందరరెడ్డిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.

వాయువ్య,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ఉందని తెలిపారు. శనివారం గుంటూరు, పల్నాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
Sorry, no posts matched your criteria.